December 18, 2023

శ్రీరస్తు అబ్బాయి

శ్రీరస్తు అబ్బాయి 
చిత్రం : స్వప్న (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : సుశీల, పి. బి. శ్రీనివాస్  

శ్లోకం|| 
సర్వ మంగళ మాంగల్యే - 
శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్యంబకే దేవి - 
నారాయణి నమోస్తుతే

పల్లవి: 

శ్రీరస్తు అబ్బాయి - 
శుభమస్తు అమ్మాయి
ఈ పచ్చని పందిరిలోనా కళ్యాణమస్తు

శ్లోకం: 
మాంగల్య తంతునా నేనా - 
మమ జీవన హేతునా
కంఠే బధ్నామి శుభగే - 
త్వంజీవన శరదాంశతం

చరణం: 1

మంత్రాలతో మీ జంట చేరాలి 
నూరేళ్ళకూ అది పంటకావాలి
మంత్రాలతో మీ జంట చేరాలి 
నూరేళ్ళకూ అది పంటకావాలి
మీ కలలన్నీ నేడే తీరాలి

వచనం: 

సర్వశుభ కారిణి ఆదిలక్ష్మి - 
కరుణా స్వరూపిణి గజలక్ష్మీ
సిరిసంపదలనిచ్చు ధనలక్ష్మీ - 
పాడిపంటలనిచ్చు ధాన్యలక్ష్మి
విజ్ఞాన మందించు విద్యాలక్ష్మి - 
విజయమును కలిగించు విజయలక్ష్మి
శక్తిని ప్రసాధించు ధైర్యలక్ష్మి
సౌభాగ్యమునుగూర్చు సంతానలక్ష్మి

ఈ అష్టలక్ష్ముల అంశలతోను వర్ధిల్లాలి గృహలక్ష్మి

చరణం 2:

చిగురాశలే సన్నాయి పాడాలి
తొలిబాసలే ఉయ్యాలలూగాలి
చిగురాశలే సన్నాయి పాడాలి
తొలిబాసలే ఉయ్యాలలూగాలి
నీ చిననాటి ప్రేమా పండాలి