December 18, 2023

జయతు జయతు..

జయతు జయతు..
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: కొసరాజు
గానం:: మాధవపెద్ది,వసంత

సాకి::

జయతు జయతు..శ్రీరామా రామ
జానకిరామా..జగదభిరామా
పావననామా..భండన భీమా
పట్టాభిరామా

పల్లవి :

వచ్చింది వచ్చింది..రామరాజ్యం 
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం

వచ్చింది వచ్చింది..రామరాజ్యం 
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం

సంపదలను తెచ్చింది..సౌఖ్యాలను యిచ్చింది 
సంపదలను తెచ్చింది..సౌఖ్యాలను యిచ్చింది 
భూలోకానికి స్వర్గం..దిగివచ్చింది

వచ్చింది వచ్చింది..రామరాజ్యం 
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం

చరణం 1:

అయోధ్యరాముడు ఇతడేలే..అవతారమూర్తి ఇతడేలే
అయోధ్యరాముడు ఇతడేలే..అవతారమూర్తి ఇతడేలే

నారాయణుడే వచ్చి..జన్మించాడు
నాలుగు కాళ్ళతొ..ధర్మం నడిపిస్తాడు
నారాయణుడే వచ్చి..జన్మించాడు
నాలుగు కాళ్ళతొ..ధర్మం నడిపిస్తాడు
హరే..హరే..హరే..హరే..హరే..హరే..హరే

వచ్చింది వచ్చింది..రామరాజ్యం 
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం

చరణం 2:

నెలకు మూడు వానలు....నిలబడి కురియురా
పచ్చగ పైరు పెరిగి..పంటలు పండురా
నెలకు మూడు వానలు..నిలబడి కురియురా
పచ్చగ పైరు పెరిగి..పంటలు పండురా
అడిగినన్ని గుమ్మపాలు..ఆవులు పిండురా
అడిగినన్ని గుమ్మపాలు..ఆవులు పిండురా
కరువు కాటకాల కసలు..చోటే లేకుండురా

వచ్చింది వచ్చింది..రామరాజ్యం 
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం

చరణం 3:

పప్పు దప్పళ్ళమ్ము..మనకు పడుతుందిరా
జోరు జోరు పరమాన్నం..జుర్రుతామురా
జుర్రు..జుర్రు..జుర్రు..జుర్రు..జుర్రు..జుర్రు
పప్పు దప్పళ్ళమ్ము..మనకు పడుతుందిరా
జోరు జోరు పరమాన్నం..జుర్రుతామురా

బలే..బలే..తియ్యమామిడి..పండ్ల విందురా
ఎగిరి గంతులేస్తుంటే అందుతుందిరా 
ఎగురు..పై కెగురు..ఎగురు పై కెగురు
ఎగురు..ఎగురు..ఎగురు..ఎగురో...