భీషణమౌ శ్రీరామ శపథం..
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: ఆరుద్ర
గానం:: సుశీల, వసంత
పల్లవి:
భీషణమౌ శ్రీరామ శపథం..
వీడదు ధర్మపథం
ఇప్పటి ఈ రఘురామ శపథం..
హృదయ విదారకం
చరణం 1:
తండ్రొక వంక తనువును బాయ
తపోభూములకు చనెనే
తమ్ముడు భరతుడు ప్రార్థించిననూ
తాపసిగానే మనెనే
మాట కోసమే అంతటి స్వామీ
మాటున వాలిని గూల్చే
శోకజలధిలో తాను మునిగినా
సుఖములు సఖునకు నొసగే
భీషణమౌ శ్రీరామ శపథం..
చరణం 2:
దారినొసంగక దర్పము చూపిన
సాగరగర్భం చీల్చే
వైరి తమ్మునికి బాస చొప్పున
వైభవ రాజ్యం కూర్చే
ఒకటే బాణం ఒకతే భార్య
ఒకటే మాటని చాటే
చింతలు బాపే శ్రీరామ వాక్యం
ఎంతటి బాధలు తెచ్చే
ఎంతటి బాధలు తెచ్చే
భీషణమౌ శ్రీరామ శపథం..
పల్లవి:
భీకరమౌ శ్రీరామబాణం..
తిరుగులేని అస్త్రం
పావన మీ రఘురామ బాణం..
భక్త పరిత్రాణం
చరణం 1:
కోపముతో కోదండము పూనిన
కొండలె అదిరేనూ
నారిని వింటికి సంధించినచో
నదులే పొంగేనూ
తూణీరములో బాణము తీసిన
క్షోణియే వణికేనూ
అమ్ము వేసినా వమ్ముకాడట
ఆ రుద్రాదులు ఆపలేరట
భీకరమౌ శ్రీరామబాణం..
చరణం 2:
సీత చెరను విడిపించిన బాణం
పాతకులను ఖండించిన బాణం
నీతివర్తనుడు నిజభక్తునిపై
నేడు వేయతగునా పాడిమీర తగునా
తగదు తగదు అని సమస్తలోకులు
చాటి చెప్పరయ్యా
తగదు తగదు అని తల్లీ జానకి
మనవి సేయవమ్మా మమ్ము బ్రోవవమ్మా ....!