September 10, 2023

ఓ రంగీ.. కురంగీ

ఓ రంగీ.. కురంగీ
చిత్రం: ఏడంతస్తుల మేడ (1980) 
సంగీతం: చక్రవర్తి 
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

ఓ రంగీ, కురంగీ, తురంగీ, సారంగీ 
అరే ఓ నా రంగీ రంగి రంగి రంగి
అరే ఓ నా రంగీ రంగి రంగి రంగి
దూకులాడకే పొంగి పొంగి
తాకనియ్యవే కోమలాంగి కోమలాంగి
రంగీ

ఓ రంగా, కురంగా, తురంగా, సారంగా 
అరే ఓ నా రంగా రంగ రంగ రంగ
అరే ఓ నా రంగా రంగ రంగ రంగ
అంతలోనే ఎందుకు బెంగ 
ఆగవయ్యా పాండురంగా పాండురంగా 
రంగా

ఓ రంగీ, కురంగీ, తురంగీ, సారంగీ 
అరే ఓ నా రంగీ రంగి రంగి రంగి

అరే ఓ నా రంగా రంగ రంగ రంగ

చరణం 1:

నీ అందం ఎప్పుడు ఆరని నిప్పులకుంపటి లాంటిది 
కాచుకోనీ వెచ్చగా... చలి కాచుకోనీ వెచ్చగా 

నీ పరువం శీతాకాలం పరిచిన దుప్పటి లాంటిది 
కప్పుకోనీ ముద్దుగా...నను కప్పుకోనీ ముద్దుగా 

ఎదలోకి చూడకమ్మో తొంగితొంగి 
కదిలింది కళ్ళలోన నీలినింగి 
సరేనా మోహనాంగి 
అరే  నవమోహనాంగి
రంగీ

చరణం 2:

నీ చూపే మంచుల అంచుల నిగనిగలాడిస్తుంది 
అది సోకనీ గిలిగింతగా...నను తాకనీ రవ్వంతగా  

నీ పిలుపే కొండల కోనల కోయిలలెగరేస్తుంది 
అది సాగనీ కవ్వింతగా...చెలరేగనీ మరికొంతగా

నీ వలపు వాడిపోని సంపెంగ 
నిలవాలి ఆ తావి మురిపెంగ
సరే నా పూలరంగా 
అరే అందాలారంగా 
రంగా