నీవేగా నా ప్రాణం
ఓ పాపా లాలి (1991)
ఇళయరాజా
ఏసుదాస్, చిత్ర
నీవేగా నా ప్రాణం అంటా..
నేడు నీతోడే నా లోకం
అంట..
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం
నీ నీడగా నే సాగేనులే
నీ వెంటా....
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం
అంట...
చరణం 1:
వెల్లివిరిసే...వెన్నెలల్లే
విరులగంధం నీవు కావే
ఆలపించే పాటలోని
తేనెపలుకే నీవు కావే
పలికించే నే దిద్దుకొన్న
బొట్టుకొక అర్థముంది
అంటానే...
పల్లవించే నీ బంధనాల చందనాలు
నాకు తెలుసు విన్నానే
కలిసేనులే నే కరిగేనులే నీలోనా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీ తోడే నా లోకం
అంట
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీ తోడే నా లోకం
అంట
చరణం 2:
కంటి వెలుగై
నిలిచిపోనా...
మనసులోనా...
నిండిపోనా...
కలలలోని...కథను నేనై
చివరి వరకు తోడు రానా
స్వర్గమేల
నా గుండెలోన ఊపిరల్లె నువ్వు ఉంటే
అంతేగా...
నన్ను పిలిచే
నీ పాటలోని మాటలోని శృతి నేనే
అంతేలే
నువు లేనిదే
ఇక నే లేనులే
ఏనాడూ...
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీ తోడే నా లోకం
అంట
నీ నీడగా నే సాగేనులే
నీ వెంటా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీ తోడే నా లోకం
అంట