ఎక్కడో పుట్టి
నగ్న సత్యం (1979)
రచన:యు.విశ్వేశ్వరరావు
గానం: జి. ఆనంద్
సంగీతం: చక్రవర్తి
ఎక్కడో...
ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి
ఎక్కడో కలిసి
ఎందుకో..ఎందుకో...ఎందుకో..
అనుకోని బంధాలు
అనురాగబంధాలు
ఏమిటో
అవి ఎందుకో...ఏమిటో...ఎందుకో
ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి
ఎక్కడో కలిసి
ఏకమైపోతారు ఎందుకో
చరణం 1:
ఎక్కడెక్కడో తిరిగితిరిగి కొన్నాళ్ళు
ఎవరినో... చూసాడు ఒకనాడు
ఆలుమగలయ్యారు మరునాడు
ఆలుమగలయ్యారు మరునాడు
ఎందుకో..ఎందుకో...ఎందుకో..
అంతవరకూ లేని దాంపత్యబంధం
ఏమిటో...ఏమిటో..
అది ఎందుకో...ఏమిటో...ఎందుకో
ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి
ఎక్కడో కలిసి
ఏకమైపోతారు ఎందుకో
చరణం 2:
ఒకడు జీవించేది తనకోసం
ఒకడు శ్రమించేది నీకోసం
ఇద్దరూ ఒకటైన సంతోషం
ఇద్దరూ ఒకటైన సంతోషం
ఎందుకో..ఎందుకో...
విడరాని బంధం
ఆ స్నేహబంధం
ఏమిటో...ఏమిటో
అది ఎందుకో...ఏమిటో...ఎందుకో
ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి
ఎక్కడో కలిసి
ఏకమైపోతారు ఎందుకో
చరణం 3:
అడవిలో పుట్టింది ఒక పువ్వు
నడి వీధి నలిగింది ఆ పువ్వు
నాచెంత చేరింది ఈనాడు
ఎందుకో...ఎందుకో...ఎందుకో
చెంతచేరిన బంధం
చెల్లాయి అనుబంధం
ఏమిటో...ఏమిటో
ఇది ఎందుకో...ఏమిటో...ఎందుకో
ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి
ఎక్కడో కలిసి
ఏకమైపోతారు ఎందుకో
ఎందుకో...ఎందుకో...ఎందుకో
అనుకోని బంధాలు
అనురాగబంధాలు
ఏమిటో
అవి ఎందుకో...ఏమిటో...ఎందుకో
అవి ఎందుకో...ఏమిటో...ఎందుకో..