ఓ రోజు
(తెలుగు పాప్ గీతం.)
అందమే ఆనందం (ప్రయివేట్ ఆల్బమ్) (1987)
రచన: రాజశ్రీ
సంగీతం: బప్పీలహరి, సురేష్
గానం: మలేసియా వాసుదేవన్, చిత్ర
పల్లవి:
ఓ రోజు కలిసిందో పిల్లా
పిల్ల కాదు అది ఓ రసగుల్లా
ఓ రోజు కలిసిందో పిల్లా....
ఓ రోజు కలిసిందో పిల్లా
పిల్ల కాదు అది ఓ రసగుల్లా
ఓ రోజు కలిసిందో పిల్లా
పిల్ల కాదు అది ఓ రసగుల్లా
ఆ కళ్ళు ఆ ఒళ్ళు
ఓహో అమ్మమ్మమ్మా...
ఓ రోజు కలిసిందో పిల్లా
పిల్ల కాదు అది ఓ రసగుల్లా
ఆ కళ్ళు ఆ ఒళ్ళు
ఓహో అమ్మమ్మమ్మా...
చక్కని పిల్లా
అది రసగుల్లా
చరణం 1:
వెన్నెలలే కురిసాయి
చూసే చూపులోనా...
స్వర్గాలే వెలిశాయి
రువ్వే నవ్వులోనా
నను కదిలించింది కవ్వించింది
రపప్పా రప్పపా
||ఓ రోజు||
చరణం 2:
ఆ రూపే హరివిల్లు
అందాలే వెదజల్లు
ఆ కళ్ళే సంకెళ్ళు
అపరంజి ఆ ఒళ్ళు
నను కదిలించింది కవ్వించింది
జుజుజ్జు జూజుజూ
||ఓ రోజు||
చరణం 3:
రోజా అందామంటే
ఓ దినమే ఆ సొగసు
మెరుపే అందామంటే
ఓ క్షణమే ఆ వెలుగు
నను కదిలించింది కవ్వించింది
యమయ్యా యాయ్యయా
||ఓ రోజు||
చరణం 4:
తొలిసారి నిను చూస్తే
మతిపోయింది నాకు
మలిసారి నిను చూస్తే
ఏమౌతుందో నాకు
నను కదిలించింది కవ్వించింది
జుజుజ్జు జూజుజూ
||ఓ రోజు||