July 27, 2020

కళ్ళలో ఎన్నెన్ని కలలో


కళ్ళలో ఎన్నెన్ని కలలో
చిత్రం:- మనస్సాక్షి (1977)
సాహిత్యం:- సినారె
సంగీతం:- జె.వి.రాఘవులు 
గానం:- పి.సుశీల, బాలు

పల్లవి:

కళ్ళలో ఎన్నెన్ని కలలో...
అ కలలలో ఎన్నెన్ని కథలో...
కళ్ళలో ఎన్నెన్ని కలలో...
అ కలలలో ఎన్నెన్ని కథలో...
కలలన్నీ పండాలి వసంతాలై, 
ఆ కధలన్నీ మిగలాలి సుఖాంతాలై
కళ్ళలో ఎన్నెన్ని కలలో...
అ కలలలో ఎన్నెన్ని కథలో...
చరణం 1:

నీ నవ్వులోని ఆ మూగబాసలే 
నవవేణునాదాలై నాలోన పలికెనులే...
నీ నవ్వులోని ఆ మూగబాసలే 
నవవేణునాదాలై నాలోన పలికెనులే...
పలికెనులే...పలికెనులే
ఆ నాదాలే ఎదగాలి రాగాలై, 
అవి గుండెలలో నిండాలి అనురాగాలై

చరణం 2:

నీ చూపులోని ఆ మమతలన్నీ 
మాటాడు మల్లికలై మదిలోన విరిసెనులే...
నీ చూపులోని ఆ మమతలన్నీ
మాటాడు మల్లికలై మదిలోన విరిసెనులే...
విరిసెనులే...విరిసెనులే
ఆ మల్లికల్లే ఒదగాలి మాలికలై, 
మన ఇద్దరికే చెందాలి అవి కానుకలై

కళ్ళలో ఎన్నెన్ని కలలో...
అ కలలలో ఎన్నెన్ని కథలో...
కలలన్నీ పండాలి వసంతాలై, 
ఆ కధలన్నీ మిగలాలి సుఖాంతాలై
కళ్ళలో ఎన్నెన్ని కలలో...
అ కలలలో ఎన్నెన్ని కథలో...
ఎన్నెన్ని కలలో...ఎన్నెన్ని కథలో...
ఎన్నెన్ని కలలో...ఎన్నెన్ని కథలో...
ఎన్నెన్ని కలలో...ఎన్నెన్ని కథలో...