July 7, 2020

మెల్ల మెల్లగా

మెల్ల మెల్లగా  
చిత్రం : చక్రపాణి (1954)
సంగీతం :  భానుమతి 
గీతరచయిత :  రావూరి సత్యనారాయణ 
నేపధ్య గానం :  భానుమతి  
 
పల్లవి :
 
రాగముతో... అనురాగముతో
మెల్లమెల్లగా నిదురా... రావే
మెల్లమెల్లగా చల్లచల్లగా 
రావే నిదురా... హాయిగా 
మెల్లమెల్లగా చల్లచల్లగా 
రావే నిదురా... హాయిగా   
చరణం 1: 

వెన్నెల డోలికలా 
పున్నమి జాబిలి పాపవై
కన్నుల నూగవె  చల్లగా 
రావె నిదురా హాయిగాకన్నుల నూగవె  చల్లగా 
రావెనిదురా హాయిగా  
మెల్లమెల్లగా చల్లచల్లగా 
రావే నిదురా హాయిగా

చరణం 2:

పిల్లతెమ్మెరలా...ఊదిన పిల్లనగ్రోవివై
జోలపాడవె తీయగా
రావె నిదురా హాయిగా 
జోలపాడవె తీయగా
రావె నిదురా హాయిగా   
మెల్లమెల్లగా చల్లచల్లగా 
రావే నిదురా హాయిగా

చరణం 3: 

కలువ కన్నియలా...
వలచిన తుమ్మెదరేడువై
కన్నుల వ్రాలవే మెల్లగా 
రావె నిదురా హాయిగా
కన్నుల వ్రాలవే మెల్లగా 
రావె నిదురా హాయిగా
మెల్లమెల్లగా చల్లచల్లగా
రావే నిదురా హాయిగా...
రాగముతో... అనురాగముతో
మెల్లమెల్లగా నిదురారావే