July 23, 2020

హృదయాన్నీ ఎవరు నిదుర లేపారు


హృదయాన్ని...
చిత్రం : మానస వీణ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
గానం: వాణీ జయరాం 

హృదయాన్ని ఎవరు నిదుర లేపారు 
హృదయాన్ని ఎవరు నిదుర లేపారు 
అనురాగాన్ని దానికెవరు నేర్పారు...
అనురాగాన్ని దానికెవరు నేర్పారు...
వయసా...
వచ్చిన సొగసా ...!
సొగసే మెచ్చిన మనసా ...!
ఈ విరహం వాటికి తెలుసా 
తెలుసా....
చరణం 1: 

పువ్వై పుడితే పూయకపోదు 
రంగూ, తేనే పొంగకపోవు 
పువ్వై పుడితే పూయకపోదు 
రంగూ, తేనే పొంగకపోవు 
పొంగును చూసి పువ్వును దోచి 
తుమ్మెద వెళితే దోషులు ఎవరు 
రంగా...
మధువుల పొంగా 
మధువే తాగిన దొంగా 
ఈ విరహం వాటికి తెలుసా 
తెలుసా....

చరణం 2:

గువ్వకు ఒకటే గూడుంటుంది 
గుండెకు ఒకటే తోడుంటుంది 
గువ్వకు ఒకటే గూడుంటుంది 
గుండెకు ఒకటే తోడుంటుంది 
రెక్కలు గువ్వనూ 
కోర్కెలు గుండెనూ 
ఎక్కడ ఉన్నా...
ఏకం చేయును 
చేసి...
జంటను చూసి...
మురిసి...
దీవెన కురిసే 
ఈ విరహం మధురిమ తెలుసా 
తెలుసా....

హృదయాన్ని ఎవరు నిదుర లేపారు 
అనురాగాన్ని దానికెవరు నేర్పారు...
వయసా...
వచ్చిన సొగసా ...!
సొగసే మెచ్చిన మనసా ...!
ఈ విరహం వాటికి తెలుసా....