July 19, 2020

అయ్యయ్యో ఓ చిన్నోడు


అయ్యయ్యో ఓ చిన్నోడు 
(తెలుగు పాప్ గీతం.)
అందమే ఆనందం (ప్రయివేట్ ఆల్బమ్) (1987)
రచన: రాజశ్రీ 
సంగీతం: బప్పీలహరి, సురేష్ 
గానం: చిత్ర 

పల్లవి:

అయ్యయ్యో... ఓ చిన్నోడు...
అయ్యయ్యో... ఓ చిన్నోడు...
మసకల్లోన కనిపించాడు...
మైకంలోన ముంచేసాడు..
చీకట్లో.. కౌగిట్లో చెవి కొరికేడు 
చీకట్లో.. కౌగిట్లో చెవి కొరికేడు 
అయ్యయ్యో... ఓ చిన్నోడు...
అయ్యయ్యో... ఓ చిన్నోడు...

చరణం 1:

చిగురాకల్లే నను తాకెను 
చిరుగాలల్లే నను సోకెను 
చిగురాకల్లే నను తాకెను 
చిరుగాలల్లే నను సోకెను 
పరాకులోనే త్రుళ్ళిపడింది వయసు 
పరాకులోనే త్రుళ్ళిపడింది వయసు 
||అయ్యయ్యో..||

చరణం 2:

ఒయ్యారాల తోటలో 
సింగారాలా వేటలో 
ఒయ్యారాల తోటలో 
సింగారాలా వేటలో 
కలిశాడు నన్నూ 
కలిపేడు కన్నూ 
కలిశాడు నన్నూ 
కలిపేడు కన్నూ...
||అయ్యయ్యో..||

చరణం 3:

ఆ చూపే మన్మధబాణం 
అది తీసిందీ నా ప్రాణం 
ఆ చూపే మన్మధబాణం 
అది తీసిందీ నా ప్రాణం 
భలే పసందూ 
ఆహా...! ఆతని పొందూ...
భలే పసందూ 
ఆహా..! ఆతని పొందూ...
||అయ్యయ్యో..||

చరణం 4:

ఆ రాతిరి నన్నే చేరెను 
నా ఊపిరి తానైపోయెను 
ఆ రాతిరి నన్నే చేరెను 
నా ఊపిరి తానైపోయెను
ముద్దులతోనే 
హా.. నా నిద్దర కలచే 
ముద్దులతోనే 
నా నిద్దర కలచే...
||అయ్యయ్యో..||