July 22, 2020

యాల యాల ఇయ్యాలా


యాల యాల ఇయ్యాలా
రూలర్ (2019)
గానం: అనురాగ్ కులకర్ణి, అనూష మణి 
రచన: రామజోగయ్య శాస్త్రి 
సంగీతం: చిరంతన్ భట్ 

పల్లవి:

యాల యాల ఇయ్యాలా 
డియ్యా డియ్యాలా  
ఎన్నియాల యాల జూసి 
ఎయ్యాలా... ఉయ్యాలెయ్యాలా 
 
యాల యాల ఇయ్యాలా 
డియ్యా డియ్యాలా  
ఎన్నియాల యాల జూసి 
ఎయ్యాలా... ఉయ్యాలెయ్యాలా  

మిలా మిలా అందం ఖిల్లా
ఆజా అంటే ఖుల్లం ఖుల్లా 
వచ్చేస్తున్నా ఆకలికళ్ళ
రాజాసింగంలా... 

ఛలో ఛలో చెమ్మకచెల్లా 
సాగిస్తానే హల్లా గుల్లా  
లాగిస్తానే చక్కెర పాల
యవ్వనాల రసగుల్లా... 

అలారమేదో మోగినాది గుండె మారుమూలా 

యాల యాల ఇయ్యాలా 
డియ్యా డియ్యాలా  
ఎన్నియాల యాల జూసి 
ఎయ్యాలా ఉయ్యాలెయ్యాలా 

చరణం 1: 

నా...పెదవులలో మధుశాలా.. 
అలజడులే తరిగేలా.. 
ముడిపడనా మదనా 
సొగసుల కెరటంగా... 

హే... ఉసిగొలిపే సుమబాలా...
అనుమతులే అడగాలా 
సరె ఇటురా అననా
తనువులు తగిలేలా...

స్వయానా చేరుకోమంది 
అల్లుకోమంది...మల్లెపూల చెరసాల 
 
ఫలానా ఇచ్చుకోమంది 
పుచ్చుకోమంది... తందనాల సందెవేళా 
ఇంతదాక వచ్చినాక 
చందనాల చర్చలేలా... 

నన్నిలాగ రెచ్చగొట్టలేదు
ఎవ్వరైన నీలా.... 

యాల యాల ఇయ్యాలా 
డియ్యా డియ్యాలా  
ఎన్నియాల యాల జూసి 
ఎయ్యాలా ఉయ్యాలెయ్యాలా 

చరణం 2:

నీ... కన్నుపడితే విరబూసా   
జారుపైటలే సరిచేసా 
కొంటె కోరికై దగ్గరై
సిగ్గులన్ని ఎగరేసా  
 
నీ...చిట్టిబుగ్గలో చిటికేసా  
నడుమొంపులో దరువేసా  

చుట్టుముట్టినా కౌగిలై  
అగ్గిమంట చవిచూసా 
మనాలి మంచులా నిన్ను
ముంచనా నేను 
ముద్దుగా ముట్టడించి...

జవానీ ముచ్చటై నిన్ను 
మెచ్చుకుంటాను 
విందుగా ఆరగించీ....

వేళపాళ చూడకంది 
వేచి వున్న చారుశీలా...  

కులాస పాట పాడమంది కృష్ణ రాసలీల 
 
యాల యాల ఇయ్యాలా 
డియ్యా డియ్యాలా  
ఎన్నియాల యాల జూసి 
ఎయ్యాలా ఉయ్యాలెయ్యాలా 

మిలా మిలా అందం ఖిల్లా
ఆజా అంటే ఖుల్లం ఖుల్లా 
వచ్చేస్తున్నా ఆకలికళ్ళ
రాజాసింగంలా...

ఛలో ఛలో చెమ్మకచెల్లా 
సాగిస్తానే హల్లా గుల్లా  
లాగిస్తానే చక్కెర పాల
యవ్వనాల రసగుల్లా...

అలారమేదో మోగినాది గుండె మారుమూలా...
అలారమేదో మోగినాది గుండె మారుమూలా...