July 27, 2020

కృష్ణానగరే మామా


కృష్ణానగరే మామా
నేనింతే (2008)
భాస్కరభట్ల 
చక్రి 

పల్లవి:

ఏ...కృష్ణానగరే మామా 
కృష్ణానగరే మామా 
సినిమాలే లైఫుర మామా 
లైఫంతా సినిమా మామా 
ఎటు చూసిన కథలే మామా 
కడతేరని కలలే మామా 
పని ఉంటే మస్తుర మామా 
లేకుంటే పస్తులు మామా 

యో... కన్నీళ్లు ఉన్నా 
యో... కష్టాలు ఉన్నా
యో... సంతోషమేరా 

యో... ఈ దారిలోనా  
యో... ఏ ముళ్ళు ఉన్నా 
యో... మాకిష్టమేరా 

ఛలో ఛలో చెయ్ కలపరమామా 
తాడోపేడో తేల్చేద్దాం మామా 
అనుక్షణం ఒక స్త్రగులే మామా
అయినసరే వదిలెళ్ళం మామా 
కృష్ణానగరే మామా... 
కృష్ణానగరే మామా... 
సినిమాలే లైఫుర మామా 
లైఫంతా సినిమా మామా 

చరణం 1:

ఓ...ఎన్నెన్నో ఆశలున్నవీ 
ఏవేవో ఊహలున్నవీ... 
బ్లడ్డంతా సినిమాసినిమని 
మెలిపెట్టీ చంపుతున్నది 
కన్నవారినీ, ఉన్న ఊరినీ 
ఉన్నపాటుగా వదిలేసొచ్చాం
పిచ్చిపిచ్చిగా నచ్చినచ్చి  
ఈ సినీఫీల్డులో దూకేశాం    
ఏ...మోసాలు చెయ్యం 
ఏ...నేరాలు చెయ్యం
ఏ...ఘోరాలు చెయ్యం
ఏ...మాకేంటి భయ్యం 
తిండున్నా లేకున్నా 
మాకేనాడు ప్రాబ్లమ్ కాదే.. 
సెట్లో లైటేస్తే 
మా కడుపునిండిపోద్దే  
వన్డేలో స్టారంటే అది చూసేంత వీజీ కాదు.
ఏళ్ళో ఎన్నేళ్ళో కన్నీళ్ళ కష్టముందే 
   
చరణం 2:

షూటింగే జరిగినప్పుడు 
ప్రతిరోజూ పెళ్ళిసందడే 
సినిమా పూర్తయ్యినప్పుడూ 
అందరికీ అప్పగింతలే 
కోడికూతకీ గంటముందుగా 
నిద్రలేవడం మాకే సొంతం 
వానలొచ్చినా, వరదలొచ్చినా 
టైముకెప్పుడూ మేముంటాం 
మేం....యాక్టింగ్ చేస్తాం 
మేం....ఫైటింగ్ చేస్తాం 
మేం....మ్యూజిక్కు చేస్తాం 
మేం....మ్యాజిక్కూ చేస్తాం 
మతిపోయే టాలెంటు 
కసి మాలోనే ఉందిరా భాయీ..
ఏదో ఓరోజు అది బయటపడతదోయి
సరదాకీ మీరంతా మా సినిమాలే చూస్తారండీ 
అయినా మేమంటే ఓ చిన్నచూపులెండీ...