July 19, 2020

అల్లరి కళ్ళ


అల్లరి కళ్ళ
(తెలుగు పాప్ గీతం.)
అందమే ఆనందం (ప్రయివేట్ ఆల్బమ్) (1987)
రచన: రాజశ్రీ 
సంగీతం: బప్పీలహరి, సురేష్ 
గానం: చిత్ర 

పల్లవి:

అల్లరి కళ్ళ మరదలు పిల్ల
అల్లరి కళ్ళా...మరదలు పిల్ల 
సందేళ చాటుకీ రమ్మంటే...రమ్మంటే 
నీవు ఏం చేస్తావూ 
నీ బదులేమిస్తావూ 
అల్లరి కళ్ళ మరదలు పిల్ల
అల్లరి కళ్ళా...మరదలు పిల్ల
సందేళ చాటుకీ రమ్మంటే...రమ్మంటే 
నీవు ఏం చేస్తావూ 
నీ బదులేమిస్తావూ

చరణం 1:

చుక్కలలోన పక్కేసి 
పక్కకు నిన్నే రమ్మంటే 
మక్కువ తీరే చక్కని వేళ 
మనసే తనకిమ్మంటె
నిన్నే.... 
చేయి చేయి కలుపంటే కలుపంటే
నీవు ఏం చేస్తావూ 
నీ బదులేమిస్తావూ 
||అల్లరి కళ్ళ|| 

చరణం 2:

కొంటె చూపుల గాలం వేసి 
నిన్నే హుషారు చేస్తే 
ఒడిలో చేరి సవ్వడి చేసి 
నిన్నే సవాలు చేస్తే 
కోరికోరి ఉడికిస్తే...ఊరిస్తే 
నీవు ఏం చేస్తావూ 
నీ బదులేమిస్తావూ 
||అల్లరి కళ్ళ||

చరణం 3:

పువ్వులవాడ నవ్వులమేడ 
సరాసరీ నీదేనంటే 
సవ్వడి చేస్తే రవ్వలరాణి 
నీకే సొంతం అంటే చూడు 
నీకు నాకు వరసంటే....వరసంటే
నీవు ఏం చేస్తావూ 
నీ బదులేమిస్తావూ 
||అల్లరి కళ్ళ||

చరణం 4:

మాటామంతీ చాలిక చాలు 
చేతలు కానీయ్ అని అంటే 
వరదల్లే ఒక వాగల్లే 
చిన్నది పై పడుతుంటే 
రేగే కన్నెవయసు నీదంటే....నీదంటే
నీవు ఏం చేస్తావూ 
నీ బదులేమిస్తావూ 
||అల్లరి కళ్ళ||