July 19, 2020

కుంకుమ పువ్వులు


కుంకుమ పువ్వులు
అనాదిగా ఆడది (1986)
సంగీతం: సత్యం 
రచన: వేటూరి 
గానం: పి. సుశీల, ఎస్.పి. బాలు

పల్లవి: 

కుంకుమ పువ్వులు చల్లెను సంధ్యారాగం...
గుండెలు గొంతున పాడెనులే అనురాగం... 
నిన్ను చేరే వేళలోనా...
సాగె నేడే రాసలీలా..
ఊగెలే తనువులే హాయిలోన 
ఊగెలే తనువులే హాయిలోనా...
కుంకుమ పువ్వులు చల్లెను సంధ్యారాగం
ఊపిరి వేణువులూదెనులే అనురాగం
నిన్ను కోరే ప్రేమలోనా 
సాగె నేడే రాసలీల 
వేయనా వలపులా పూలమాల 
వేయనా వలపులా పూలమాలా...

చరణం 1:

పెళ్ళికి ముందు పల్లకిలో 
ప్రేమల విందు... కౌగిలిలో 
యవ్వనమంతా నీదై నవ్వనీ 

తేనెలు చల్లిన వెన్నెలలో 
కన్నులు చూడని వన్నెలలో 
పరువాలన్నీ నావై పండనీ...

సిగ్గులతో నా బుగ్గలలో 
ప్రియలేఖలు వ్రాస్తుంటే...

బదులుగా ముద్దులే ఇవ్వనా...
బ్రతుకు నీ ముడుపుగా చేయనీ...

చరణం 2:

ఆమని దాచే మల్లికలో 
ఆశలు దోచే అల్లికలో 
నీ సొగసంతా నన్నే పొందనీ...

శ్రావణమాసపు జల్లులలో 
సంసారపు హరివిల్లులలో 
నా సిరులన్నీ నీకే చెందనీ... 

చుక్కలతో నలుదిక్కులకీ 
చిరునవ్వులు వస్తుంటే 

వలపులా గడపలే దాటనీ...
బిడియపూ గడియలే తీయనీ..

కుంకుమ పువ్వులు చల్లెను సంధ్యారాగం
గుండెలు గొంతున పాడెనులే అనురాగం 
నిన్ను కోరే ప్రేమలోనా 
సాగె నేడే రాసలీల.... 
వేయనా వలపులా పూలమాలా....
ఊగెలే తనువులే హాయిలోనా...