సుందర కాండ గానం - ఎం. ఎస్ . రామా రావు - మొదటి భాగము
శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా నీ పలికెద సీతారామకథా
శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు - అతి బలవంతుడు రామ భక్తుడు
లంకకు పోయి రాగల ధీరుడు - మహిమోపేతుడు శత్రు ఘర్షణుడు |
జాంబవదాది వీరులందరును - ప్రేరేపింపగా సమ్మతించెను
లంకేశ్వరుడు అపహరించిన - జానకీ మాత జాడ తెలిసికొన ||