అంత్యానుప్రాసాలంకారము
మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్యానుప్రాసాలంకారము అవుతుంది.\
తెలుగు చిత్రాల్లోని పాటల్లో మరి కొన్ని ఉదాహరణలు
క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన.
నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే (పద్మవ్యూహం)
మాట లేకున్నను భాష ఉంటుందిలే
ప్రేమయే లేకపోతే జీవితం లేదులే
వాసనే లేకనే పూలు పూయొచ్చులే
ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే?
నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఎదో అందిలే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా
ఓ మనసా
పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో.. (తేనె మనసులు)
తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో..
విందులే.. చేయనా..
వేణూ గానాలెన్నో ఈ రాధ గుండెల్లో..
మౌన గాథలెన్నో ఈ పేద గుండెల్లో..
పాడనా.. ఊపిరై.. రాధాలోలా..
ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..
అణువణువున హృదయం అడుగడుగున ప్రణయం (కోటికొక్కడు)
చిరునవ్వుల్లో శ్రీరాగం.. అరచూపుల్లో అనురాగం.
