November 21, 2021

తళుక్కు బెళుక్కు గుళుక్కు అందాలు

తళుక్కు బెళుక్కు
చిత్రం: కోకిల (1989)
సంగీతం: ఇళయరాజా 
రచన: వేటూరి 
గానం: మనో, చిత్ర 

పల్లవి: 

తళుక్కు బెళుక్కు గుళుక్కు అందాలు 
తరుక్కు తరుక్కు కొరుక్కుతింటుంటే
 
దొరక్క దొరక్క ఒడుక్కు సందేళ
ఎరక్క మరక్క ఇరుక్కు పోతుంటే 

గుమ్మెత్తు నీ సోకు గుచ్చెత్తుకుంటేనే కోపాలా 

వెన్నెత్తు కెళ్ళొద్దు నన్నెత్తుకో ముద్దు గోపాలా

తళుక్కు బెళుక్కు గుళుక్కు అందాలు 
తరుక్కు తరుక్కు కొరుక్కుతింటుంటే
 
దొరక్క దొరక్క ఒడుక్కు సందేళ
ఎరక్క మరక్క ఇరుక్కు పోతుంటే 

చరణం 1:
     
తెలుక్కు అందాలు తేవాలా?
చెళుక్కు చేవ్రాలు చేయాలా?

లిరిక్కు లేవేవో పాడాలా?
మ్యూజిక్కుతో ముద్దులాడాలా?

ఈ పట్టుకోకట్టుకోవాలమ్మో, ఆ కట్టు ఆకట్టుకోవాలమ్మో

నీ బొట్టు నేనెట్టుకున్నా సరే...
ఈ బెట్టు ఇట్టాగే సాగాలయ్యో 

జాజుల్లో గంధాలు గాజుల్లో నాదాలు రాబట్టనా...

శృంగార మంత్రాలు శ్రీవారి దాహాలు జోకొట్టనా

ఎన్నెట్లో గోదారి కౌగిళ్ళకే దారి పట్టాలమ్మో

చరణం 2:
  
వీణల్లో లిల్లీసు పూయాలా 
ట్రంపెట్లో సన్నాయి మ్రోగాలా 

నా లేఖ నీ కాటుకవ్వాలా 
నీ కళ్ళ క్రావళ్ళు దిద్దాలా?

న్యూయార్కులో మువ్వగోపాలుడే 
బ్రేకాడుతూ వేణు ఊదాలయ్యో 

మా కూచిపూడొచ్చి గోపెమ్మతో 
మైఖేలు జాక్సను ఆడాలమ్మో

అట్టొచ్చి ఇట్టొచ్చి అంటొద్దు ముట్టొద్దు చంపొద్దిలా 

బెట్టెక్కి గుట్టెక్కి చెట్టెక్కి కూకుంది నా కోకిలా 

ఆగాలి ఈ గాలి జోరింక తగ్గాలి ముప్పొద్దులా