November 21, 2021

జింగు జింగు చీర కోణంగి కొంగు జార

జింగు జింగు చీర...
చిత్రం: లారీ డ్రైవర్ (1990)
రచన: సిరివెన్నెల
సంగీతం: చక్రవర్తి
గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

జింగు జింగు చీర కోణంగి కొంగు జార 
నువ్వంగి వంగి చూడ కంగారుగుందిరో...
కొంగు దొంగ రార ఈ గంగ పొంగు లార 
బంగారు బెంగ తీర రాపాడమందిరో.
చెంగుమనే చెంగునిలా చేపట్టరో
రంగులలో సంగతులే రాబట్టరో
రంగేళి రంగాలు చూపెట్టరో...

రంగు రంగు జాణ నా నంగనాచి మైనా 
నీ హంగు దోచుకోనా నా రంగనాయకీ
అరే... సంబరంగ రాన సంపెంగ సొంపుకూన 
కంగారు హాయి తేనా చెంగావి ఛాయకి
పడుచు ఎదే పొడుపుకథై కవ్వించెరో
తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో
సింగారి సిగ్గారి చిక్కాలిరోయ్

జింగు జింగు చీర కోణంగి కొంగు జార
నువ్వంగి వంగి చూడ కంగారుగుందిరోయ్...

చరణం 1: 

గళ్ళకోక చుట్టూ నీ కళ్ళు అల్లుకుంటు
గుల్లగుల్ల చేసే ఈ అల్లరేందిరో
చిత్తజల్లే పడి చిత్తు కాదా మడి
పిల్ల బండారం దండోరా అయ్యిందిరో

ఉల్లిరేకులల్లే కిల్లాడి సోకులన్నీ
వలిచి వలిచి కళ్ళే కాకెక్కుతున్నవే
ఉడుకు చల్లార్చవా... ముడుపు చెల్లించవా
కన్నెకారంతో మమకారం జోడించవా

ఊ కొట్టనా... జతై జోకొట్టనా

ఈ పట్టుతో మతేపోగొట్టనా

ఏ గుట్టు లేనట్టు జై కొట్టనా

చరణం 2: 

చిక్కుచిక్కు పిల్ల నీ సిగ్గు సంతకెల్ల
నా ముద్దు అగ్గిపుల్ల ముట్టించి చూడనా
చురుకు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి
సరుకు సరదాగా చెలరేగి ఊరేగగా

హేయ్... పక్కపక్కకొచ్చి నా పైట గాలిపీల్చి
నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పులేదయ్యో
సత్తువంతా చెల్లే మత్తుమందే జల్లే
సోకు వాకిట్లో స్పృహపోతే గొడవేనయ్యో

ఓయ్ ... మైకాలలో ఇదేం మాలోకమో

అంతే మరీ... అదే చెలిగారడీ

జన్మంతా ఈ మత్తే ఉంటే సరి

జింగు జింగు చీర కోణంగి కొంగు జార 
నువ్వంగి వంగి చూడ కంగారుగుందిరో...

అరే... సంబరంగ రాన సంపెంగ సొంపుకూన 
కంగారు హాయి తేనా చెంగావి ఛాయకి...

చెంగుమనే చెంగునిలా చేపట్టరో

ఒయ్...తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో

రంగేళి రంగాలు చూపెట్టరో...

రంగు రంగు జాణ నా నంగనాచి మైనా 
నీ హంగు దోచుకోనా నా రంగనాయకీ

జింగు జింగు చీర కోణంగి కొంగు జార
నువ్వంగి వంగి చూడ కంగారుగుందిరోయ్...