తెలుసులే తెలుసులే
చిత్రం: జేగంటలు (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
తెలుసులే తెలుసులే
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే
ఎవరేమన్నా ఏమనుకున్నా
ప్రేమే గెలవక తప్పదని
తెలుసులే
తెలుసులే తెలుసులే
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే
కౌగిట కలిసిన ప్రేమలకు
చీకటి తొలగక తప్పదనీ
తెలుసులే
చరణం 1:
నీవు ఊపిరై ఇన్నాళ్ళూ
నాలో గుసగుసమన్నావని
నీవు ప్రాణమై ఇన్నాళ్ళూ
ఎదలో ఎదలే విన్నావని
నీవు ఊపిరై ఇన్నాళ్ళూ
నాలో గుసగుసమన్నావని
నీవు ప్రాణమై ఇన్నాళ్ళూ
ఎదలో ఎదలే విన్నావని
జాబిలి జాబులు అందుకునీ
వెన్నెల లేఖలు వ్రాసుకునీ
ఈనాడే నువ్వొస్తావని
నీ నీడే నాకిస్తావని
తెలుసులే
తెలుసులే తెలుసులే
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే
తెలుసులే తెలుసులే
చరణం 2:
ఆరు ఋతువులు ఆమనులై
పూలపల్లకీ తెస్తాయని
ఏడు రంగుల హరివిల్లే
మన ఇల్లై దిగి వస్తుందని
ఆరు ఋతువులు ఆమనులై
పూలపల్లకీ తెస్తాయని
ఏడు రంగుల హరివిల్లే
మన ఇల్లై దిగి వస్తుందని
రేపటి రెక్కలు కట్టుకునీ
వేకువ దివ్వెలు పెట్టుకునీ
నాకోసం నువ్వొస్తావనీ
నాలోనే నువ్వుంటావని
తెలుసులే
తెలుసులే తెలుసులే
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే
తెలుసులే తెలుసులే
చరణం 3:
సూర్యచంద్రులూ వెలగాలన్నా
దిక్కులు జగతికి మిగలాలన్నా
కాలం ముందుకు సాగాలన్నా
దైవం ముక్తిని పొందాలన్నా
మనం కలవక తప్పదనీ
మమత గెలవక తప్పదనీ
తెలుసులే
తెలుసులే తెలుసులే
నీకు తెలుసోలేదో గానీ
నాకు తెలుసులే
తెలుసులే
తెలుసులే