అలంకారము తెలుగు వ్యాకరణంలో ఒక భాగము. అలంకారములు మూడు రకములు.
1. శబ్దాలంకారములు (అనుప్రాసాదులు),
2. అర్థాలంకారములు (ఉపమాదులు),
3. ఉభయాలంకారములు (సంసృష్టి మొ||)
శబ్దాలంకారములు:
అర్థము విచారింపక శబ్దము వినఁగనే చెవులకింపుగా వినఁబడునది. ఇందులో ననేక భేదములుఁ గలవు.
1) అనుప్రాసాలంకారము
• వృత్త్యనుప్రాసాలంకారము
• ఛేకానుప్రాసము
• లాటానుప్రాసాలంకారము
• అంత్యానుప్రాసాలంకారము (అంత్యనియమము)
• పునరుక్తవచాభాసము
వృత్త్యనుప్రాసాలంకారము
ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది. వృత్తం అంటే తిరగడం, ప్రాస అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదాహరణలు:
అడిగెదనని కడువడి జను (భాగవతం-గజేంద్రమోక్షం)
అడిగిన తను మగుడనుడువడని నడయుడుగున్
వెడ వెడ జడముడి తడబడ
అడుగిడు నడుగిడదు జడిమ అడుగిడు నెడలన్
భాగవతం లోనిదే వీరభద్రవిజయం సందర్భంలోని మరో పద్యం (సీసం)
అభ్రం లీహాదభ్ర విభ్రమ భ్రభ్రమ
కృన్నీల దీర్ఘ శరీర మమర
ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల
జాజ్వాల మానకేశములు మెరయ
షండ దిగ్వేదండ శుండాభ దోర్దండ
సాహస్రా ధృత హేతి సంఘమొప్ప
వీక్షణ త్రయలోక వీక్షణ ద్యతిలోక
వీక్షణ తతి దుర్మిరీక్షముగను
క్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమూలికలునుదనర
అఖిలలోక భయంకరుడగుచు వీర
భద్రుడుదయించె మారట రుద్రుడగుచు
• మకరంద బిందు స్యందన సుందరము (బిందు పూర్వక ద కారం)
• ఆనంద కందళ సందోహము (బిందు పూర్వక ద కారం)
• సమద విపక్ష శిక్షణ విచక్షణ (క్ష కారము)
• సువిలాస సంపద సరణి (స కారము)
• బాలా! ఏల బేల వయ్యెదవు? (ల కారము)
తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు
క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన.
ఇందువదన కుందరదన (ఛాలెంజ్, బిందు పూర్వక ద కారం ఎక్కువసార్లు వస్తుంది)
మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగలా మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జోహారికా
నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి (ట్టి, జగదేకవీరుడు-అతిలోక సుందరి)
గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టీ
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
చీకటింట దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి
పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళమ్మి నువ్వు పుట్టింది నాకోసమమ్మి
ఇక నీ సొగసు నా వయసు పేనుకొనే ప్రేమలలో
యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగాదిగా తాపం
పట్టె మంచమేసిపెట్టి పాలు పెట్టి పండు పెట్టి
పక్క మీద పూలు కొట్టి పక్కా పక్కాలొళ్ళు పెట్టి
ఆకులో వక్క పెట్టి సున్నాలెట్టి చిలకా చుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్ని పండాపెట్టి
చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్ని ఆరాబెట్టి
కళ్ళలోన వత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి
ఒట్టే పెట్టి వచ్చేసాక మామా నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా
చుట్టెయ్యి సందె సీకట్లోనా నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా
ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో
అభ్రపథమ్మున విభ్రమవిలసిత శుభ్ర కౌముదీదీపికా..ఆ....(పెళ్ళిసందడి)
దుగ్దంబోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధశ్రీ నాయికా..
నువ్విట్ట.. నేనిట్ట... కూకుంటే.. ఇంకెట్టా (సీతామాలక్ష్మి)
తెల్లారిపోయేదెట్టా.. హా.. ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..
నువ్విట్ట.. నేనిట్ట... కూకుంటే.. ఇంకెట్టా
నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా
ఈ ఊపు ఆపేదెట్టా..హా.. నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..
నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే...( జానకి, సుశీల, సినారె, ఇళయరాజా, కొత్త జీవితాలు)
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే
ఆ....ఆ...ఆ...ఆ...
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే...
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే...
కన్నియ ఊహలు వెన్నెలలై...కదలే కదలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో...కన్నులు దాటిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే...చిరు మరులని చిలుకగ
తం తన నంతన తాళంలో..రసరాగంలో మృదునాదంలో...
నవ జీవన భావన పలికెనులే
దవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే.. ఏమనెనో...(సినారె, మాస్టర్ వేణు, అనురాగం)
ఏమనెనా ఒంటరితనమింక చాలు చాలనే
దవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే.. ఏమనెనో?
ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే
ఓ ఓ ఓ ఓ ...
పదే పదే కన్నులివే బెదరునెందుకు
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు
రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి (ఆత్రేయ, మంచి-చెడు)
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...
వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా(ఆఖరి పోరాటం)
ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే
నీతోడు కావాలి నే తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లీ... సూరీడూ... ఆకాశంలో నిండిన సొగసుల
తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో.
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో (ఆఖరి పోరాటం)
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో
నీ వంపుల సొంపే నా వంటికి పంపే
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో
ముద్దుల కుడుము ఇస్తా వస్తే... ఓ ముద్దుల గుమ్మా (డాన్స్ మాస్టర్)
ఈ మద్దెల మామా దరువే దరువు..నా పుత్తడి బొమ్మా
బిత్తరపోకే ఇదంతా నాటకమే..
అదంతా బూటకమేలే ఛలో భామా...
సాగే వన్నెవాగే నన్ను... కమ్మేసి౦దిరో(దొంగ మొగుడు)
ఊగే కన్నెలాగే నన్ను ...లాగేసి౦దిరో
మూగే మూగసైగే నన్ను ...ముద్దాడి౦దిరో
ఊగే తీగలాగే మేను...అల్లాడి౦దిరో
గాజుల బాజాలతో ...జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో ...రోజులు ఎదురేగెనే
తనివే తీరని... తమినీ ఊరనీ
జతలో గతులే... జతులై...
బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా
ఒహొ నల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా ఓ..
యాలయాలయాలగ ఇదేమి ఉయ్యాలా (మౌనపోరాటం, జానకి)
యాలగాని యేలలో ఎదెట్ట ముయ్యాలా
ఈ తడిలో తడితాకిడిలో చలి ఆరడి సాగిన సందడిలో
బిడియాల యాలయాలగ ఇదేమి ఉయ్యాలా...?
లల్లలలా లల్లాల లాలాల లాలాలా
తానమాడు తంగేటి తేనెలలో (మొండిమొగుడు పెంకి పెళ్ళాం)
తాళమేసుకో తీపి ముద్దూ
తీగ మీటి పోయేటి వెన్నెలలో
పాట కన్నా నీ పైట ముద్దు
కౌగిలింతల కిస్తీ తనకిస్తీ
కన్నెవలపుల కుస్తీ చవిచూస్తి
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కో..కోకో..కోన వెన్నెల కురిసిన పూపొదలా
కోకిలమ్మ కొత్తిల్లు కోరుకునీ
అత్త ఇంటికే చేరె నేడు
గున్నమావి కొమ్మల్ని వీడుకుని
గుండెగొంతులో పాట పాడు
చేతిలో చేయివేస్తీ మనసిస్తీ
రాజధానని వస్తీ ఎద బస్తీ.
అలిగిన పోకడ వలపుల రాకడ..తెలిసెను చలి గురుడా(దొంగల్లుడు)
నున్నని నీమెడ వెన్నెల మీగడ..చెలిమికి చెరుకుగడా
కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు
అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి (మరణ మృదంగం)
కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండి ప్రేమా...
మహా కసిగున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దుల్లో ముగ్గేసి ముద్దల్లె తడిపేసి కొట్టండి కొట్టండి
కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో (కొదమసింహం)
పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో
రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో
తెలవారిపోతుందా తొలికోడి కూసింది
కలలేనే కంటున్నా కథ బాగా ముదిరింది
పొంగే వరద చెలరేగే సరదా
ఏదో మగత ఎద దాటే మమత
ఏది ఒప్పో ఏది సొప్పో మనకెంతో నచ్చదే
జిగిజిగిజిగిజ జాగేల వనజ రావేల నారోజా (జొన్నవిత్తుల, చెట్టు కింద ప్లీడరు)
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..
నాదేలే మమతల మణిహారం..
చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో (కృష్ణ గారడి)
చక్కిలిగింతల్లో చెక్కిలి ముద్దాడుకోనా
అరే..చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చక్కిలిగింతల్లో చెక్కిలి ముద్దాడుకోనా.. పాపా
అబ్బ నా గుండె తాళాల... నీ కంటి మేళాల మోతే పుడుతుంటే
చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా...
అబ్బ.. చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా... బావ
అబ్బ.. నా ప్రేమ తాళాల నీ పెళ్ళి మేళాల మోతే పుడుతుంటే
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో(ప్రజారాజ్యం)
వయ్యారి చిందుల్లో..ఓ...ఓ...ఓ...
మువ్వా మువ్వా ముద్దాడంగ...ముద్దు ముద్దూ పెళ్ళాడంగ
అందాలన్నీ అల్లాడంగ...రావే..హో..హో..హో...
కొండకోనల్లో చాటుగా.. ఎత్తు పల్లాలు తెలిసేలే (కొండవీటి దొంగ)
కంటి కోణాలు సూటిగా.. కొంటె బాణాలు విసిరేలే
సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ
చూపుకే సుళ్ళు తిరిగె నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ
కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లో
పడేశాక వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో
సందె ఓ షేపు చిందె ఓ వైపు అందె నీ సోకులే
తణక్కు దిన..
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. నా ముద్దు పుచ్చుకోవా..
ఆజా రోజా తీశా దర్వాజా (ముఠా మేస్త్రి)
బాజా లేని తాజా మ్యారేజా
హొయ్ హొయ్ హొయ్ హొయ్
యమ జోర్ జోర్ జోరుగుంది
జోడి కట్టేసే యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
అంజనీపుత్రుడా వీరాధివీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా(ముఠా మేస్త్రి)
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
అనగల రాగమై తొలుత వీనులలరించి (సప్తపది)
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించి
జీవన రాగమై.. బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై.. బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ
వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురళి.. మువ్వలమురళీ
ఇదేనా ఆ మురళీ...
ఇంతినే... చామంతినే.... మరుదంతినే.... విరిబంతినే..... (సప్తపది)
ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే
జాణతనమున సతులలో...
జాణతనమున సతులలో... నెరజాణనై! నెరజాణనై!
నెరజాణనై.. వెలిగేటిదాన భామనే.... సత్య భామనే!
అలలు కలలు ఎగసి ఎగసి (సీతాకోకచిలుక)
అలసి సొలసి పోయే
పగలు రేయీ మురిసి మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ మెలిసే జీవనరాగంలో