ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది. వృత్తం అంటే తిరగడం, ప్రాస అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు
క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన.
అత్తరు ముద్దుకు నెత్తురు పొంగిన మత్తుల మన్మథ నేరం (స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్)
అక్కడి కిక్కులు ఇక్కడికెక్కిన సిగ్గు దుమారం
అమ్మడి గుమ్మకు చెమ్మలు చిమ్మిన కమ్మని కౌగిలి హారం
ఎక్కడ తాకితే అక్కడ సోకుల టోకుల బేరం
ఎక్కడ పడితే అక్కడ తాడితే పలికే వలపులివే
ముక్కుల పచ్చలు మక్కువ పెంచిన చక్కిలి గింతల గీతం
చుక్కల వేళకు అక్కరకొచ్చిన ఈ సుముహూర్తం
అందని లోతులు అల్లుకుపోయిన అల్లరి కాముడి బాణం
చందన చర్చగ చిందిన చిచ్చుగ తీసెను ప్రాణం
జల్లెడ పడితే జల్లున పొంగే వయసుకు వరదలివే
జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ... హోయ్
ప్రేమంటేనే పేచీ రామా...
కరివరద మొరను వినలేవా.. (జాకీ)
శశివదన చెలిమి కనలేవా...
నా మాటే మన్నించీ..
నాతోటే నిన్నుంచీ
మన రాదా
మహరాజా
బిరాన (వేగంగా) చేరుకోరా
సరాగమాడుకోరా
వరించి ఏలుకో...
వసంతమాడుకో..
వానొచ్చే వరదొచ్చే.. ఉరకలేక సావొచ్చే (రంగూన్ రౌడి)
మెరకలెక్క సాలొచ్చె.. సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలితిరిగి
ఈ పట్టుతో మతే పోగొట్టనా (లారీ డ్రైవర్, సిరివెన్నెల)
ఏ గుట్టు లేనట్టు జై కొట్టనా
అమ్మడో అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి... ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచీ (ఇంద్ర)
బావరో బావర్చి తినిపించవా మిర్చి... వాయనాలు తెచ్చి వడ్డించు వార్చి
ముప్పూటా ముద్దొచ్చి... మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పిచ్చి... ఊరంతా తిప్పిచ్చి ... ఈ.. ఈ.. ఈ
కోకిలా... కొ క్కొ కోకిల (కోకిల)
కూతలా... రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
పుత్తడిబొమ్మ చిరుచిత్తడి రెమ్మ(కోకిల)
గుమ్మడి గుమ్మ రసదానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెలకొమ్మ
తళుక్కు బెళుక్కు గుళుక్కు అందాలు (కోకిల)
తరుక్కు తరుక్కు కొరుక్కుతింటుంటే
దొరక్క దొరక్క ఒడుక్కు సందేళ
ఎరక్క మరక్క ఇరుక్కు పోతుంటే
గుండె గుండెకు తెలుసు.. (బొబ్బిలి పులి, దాసరి)
గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు..
గుండె కోత బాధెంతో
నీ గుండె రాయి కావాలి
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలీ (బలరామకృష్ణులు)
నీ మనస్సులో తపస్సుకే శిరస్సు వంచనీ
వయసుకు చలివో
ప్రియ చెలివో .. తెలియదుగానీ
చిలకల కొలికి మనసిపుడు తెలుపవే
వలపుల వలవో ఒక కలవో ఎరుగను గానీ
కనులలో వెలిగే కథలిపుడు తెలిపెలే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో (అన్నయ్య)
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలివిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే
పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు.. కరగాలి కౌగిళ్ళలో (సొమ్మొకడిది సోకొకడిది)
వలపించే ఒళ్ళు.. వలచే పరవళ్ళు.. కదిలే పొదరిళ్ళలో
తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు.. కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు.. బిగిసే సంకెళ్ళలో
చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా..(కన్నవారి కలలు, రాజశ్రీ)
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ...
ఆహా..చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా...
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ...
ఆ....కొంటెగా నిన్నేదో కోరాలనివుంది...
ఆ....తనువే నీదైతే దాచేదేముంది ...
మనసులవీణియపై ...బ్రతుకే మ్రోగిందీ...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు...
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా (సితార)
కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా
చిలికిన చిలకవు ఉలకవు పలకవు.. ఓ మైనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన... ఓ మైనా మైనా
కలలో మేలుకుంటావో.. (కల్పన)
నా కళలే ఏలుకుంటావో..
కలలో మేలుకుంటావో..
నా కళలే ఏలుకుంటావో..
కలలిక మాని కలయికలో..
నా కనులలో చూసుకుంటావో.. రామయ్యా
పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని (రాజశ్రీ, సత్య)
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమవీధిలో
ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణయోగం (నిర్ణయం, గణేష్ పాత్రో)
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయిరాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ వియ్యాలతో..
పట్టు పట్టు చెయ్యే పట్టు (సాహితి, శంకర్ దాదా )
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్
హే కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే
పట్టు పట్టు పరువాల పట్టు .. (ప్రేమలేఖ, భువనచంద్ర)
కట్టు కట్టు సొగసైన కట్టు
ఒట్టు ఒట్టు యదపైన ఒట్టు
చుట్టు చుట్టు చీరల్లే చుట్టు
సుందరుడా నిను వలచితిరా
చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరుచిలకనురా
నను పలుచన చేయకురా
పట్టు పట్టు పరువాల పట్టు
కట్టు కట్టు సొగసైన కట్టు
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ (లేడీస్ టైలర్, సిరివెన్నెల)
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక.. చిక్కవె చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..
మచ్చున్న భామ... కనులకు కనరావా
ఉన్నాను రావా.. నలుచెరగుల తిరుగుదు మరి