Showing posts with label ఆహ్వానం (1997). Show all posts
Showing posts with label ఆహ్వానం (1997). Show all posts

దేవతలారా రండి



దేవతలారా రండి
చిత్రం : ఆహ్వానం (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

దేవతలారా రండి 
మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే 
నా తోడుని పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి

శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిలిలోన పున్నమిపూల వెన్నెల విరియాలి
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి

తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళతెచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోటా
నిధినిక్షేపాలే నిద్దురలేచి ఎదురొచ్చేనంటా

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతి రాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి
దేవతలారా రండి 
మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే 
నా తోడుని పంపించండి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే 
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో 
వివాహం జరిపించాలండి