తారక దిగివచ్చి
ఊయల (1998)
బాలు, చిత్ర
చంద్రబోస్
ఎస్వీ కృష్ణారెడ్డి
తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే
కాదనగలనా... కాదనగలనా
మెరుపే ఎదురొచ్చి చురుక్కున చుట్టేస్తే
కాదనగలనా... కాదనగలనా
నిన్నటి వరకు కన్నులు కనని
కలలే చెలిగా కలిసాస్తే
కాదనగలనా.... కాదనగలనా
తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే
కాదనగలనా.... కాదనగలనా
చరణం 1:
చందమామ వెన్నెలవదా కలువల మాటను కాదనక
హోయ్... చల్ల కాస్త వెన్న కాదా కృష్ణుని మాటను కాదనక
ఏటి నీరు కాదనలేక మేఘమల్లే మారేనుగా
మేఘమాల కాదనలేక వాగులాగ పారేనుగా
ఈ ప్రేమన్నది నీ లీలే నని
నా జన్మన్నది నీ ఒళ్ళోకని
ఆ దివి ఈ భువి ఔనంటే
కాదనగలనా.... కాదనగలనా
తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే...
కాదనగలనా.... కాదనగలనా
చరణం 2:
చల్లగాలి పాట కాదా వేణువు మాటను కాదనక
పిల్లమొగ్గ పువ్వు కాదా తుమ్మెద మాటను కాదనక
పరిచయాలు కాదనలేక ప్రణయమల్లె మారేనుగా
ప్రణయకథలు కాదనలేక పరవశించి పోయేనుగా
నీ సిగ్గున్నది నే నల్లేందుకు
నీ బుగ్గున్నది నే గిల్లేందుకు
అనుకుని హత్తుకుపొమ్మంటే
కాదనగలనా.... కాదనగలనా
తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే
కాదనగలనా... కాదనగలనా
మెరుపే ఎదురొచ్చి చురుక్కున చుట్టేస్తే
కాదనగలనా... కాదనగలనా
కాదనగలవా... కాదనగలవా
కాదనగలనా... కాదనగలవా