October 4, 2025

ప్రేమ ఓ ప్రేమా

మనసులో మాట (1999)
రచన: సిరివెన్నెల
సంగీతం: ఎస్వీ కృష్ణారెడ్డి 
గానం: చిత్ర

పల్లవి : 

ప్రేమ ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా హయ్యో రామా

గుమ్మందాకా వచ్చి
ఇపుడాలోచిస్తావేమ్మా

గుండెల్లో కొలువుంచి
నిన్ను ఆరాతీస్తాలేమ్మా
ఇకపై నువ్వే నా చిరునామా

ప్రేమా ఓ ప్రేమ వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా హయ్యో రామా

చరణం 1:

హృదయములో మృదులయలో
కదిలిన అలికిడి తెలియనిదా
నిద్దురలో మెలకువలో
అది నను నిమిషం విడిచినదా

ఎక్కడుందీ ఇంతకాలం
జాడలేని ఇంద్రజాలం
సరస స్వరాగ సురాగమదేదో
నరనరములా స్వరలహరులై
ప్రవహించిన ప్రియమధురిమా

ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా

చరణం 2:

అడుగడుగూ తడబడగా
తరిమిన అలజడి నువ్వు కాదా
ఆణువణువూ తడిసేలా
తడిమిన తొలకరి నువ్వు కాదా

స్వాతి స్నేహం ఆలపించీ
చక్రవాకం ఆలకించి
మధనశరాలే ముత్యాలసరాలై
తొలివానగా చలివీణగా
చెలి లీలగా ఎద వాలెగా

ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా