పక్కా జెంటిల్‌మాన్‌ని

చిత్రం: సూపర్ పోలీస్ (1994)
సంగీతం: రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, జానకి

పల్లవి : 

పక్కా జెంటిల్‌మాన్‌ని 
చుట్టపక్కాలే లేనోడ్ని   
పూలపక్కే వేసి చక్కా వస్తావా 

పక్కా జెంటిల్‌మాన్‌ని 
చుట్టపక్కాలే లేనోడ్ని   
పూలపక్కే వేసి చక్కా వస్తావా 

ఆ ఆ...
పుణ్యం కొద్దీ పురుషా 
పట్టెమంచం కొద్దీ మనిషా 
పాలచుక్కే చూసి పైపైకొస్తావా 

పుణ్యం కొద్దీ పురుషా 
పట్టెమంచం కొద్దీ మనిషా 
పాల చుక్కే చూసి పైపైకొస్తావా

కులాసాల ఘంటసాల
కొత్త కూనిరాగమందుకో
మారా ఓ కుమారా 
కుర్ర కూచిపూడి ఆడుకో 

పక్కా జెంటిల్‌మాన్‌ని 

చరణం 1:

ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ...ఆ 
ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ 
ఈడోళ్ళలో చినవాడ్ని 
యే రాసలీలకైన గానలోలుడైన వాణ్ణి

కుర్రోళ్ళు కోరిన దాన్ని 
కుచ్చిళ్ళు జారిన దాన్ని 
ఏ ప్రేమలేఖ రాక చిన్నబోయి ఉన్నదాన్ని
 
పాట సిరి వేటలాడి 
పైటచాటులడిగినవాడ్ని
ఆటలకు హంసలాడే  
ఆడగాలి తగిలినవాడ్ని

అజంతాల అందాలన్ని 
కుదించి మధించి వధించి పోరా

పక్కా జెంటిల్‌మాన్‌ని 

చరణం 2:

పైటేసి పుట్టినదాన్నీ ఆ...
పైటేసి పుట్టినదాన్ని 
మొగ్గేసి పెరిగినదాన్ని 
యే తీపి కాటుకైన ఓపలేని వయ్యారాన్ని

మాటేసి పొంచినవాణ్ణి  
మావిళ్ళు విసిరినవాణ్ణి
నీ కోణమంటుకున్న పూలబాణమంటివాణ్ణి

నిన్ను గని కన్నెఈడు 
జున్నులార విడిచినదాన్ని 
వెన్నెలకు వేసవల్లే 
మల్లెసోకు విరిసినదాన్ని 

వసంతాలు నాతో ఆడి 
రసాల కితాబు రచించి పోవే 

పక్కా...ఆహా...100% 
పక్కా జెంటిల్‌మాన్‌ని 

No comments:

Post a Comment

Leave your comments