తేలుకుట్టినా తెనాలిలో

సూపర్ పోలీస్ (1994)
గానం: మనో, సుజాత
రచన: వేటూరి
సంగీతం: రెహమాన్ 

పల్లవి : 

తేలుకుట్టినా తెనాలిలో 
తేనెటీగల పెదాలలో 

మంటపెట్టకూ మనాలిలో
మల్లెమొగ్గల మసాజులో 

కన్నుకొట్టకే కబాడిలో
కౌగిలింతల కవాతులో

లవ్వు అన్న ఈ లడాయిలో 
పువ్వు తాకకూ బడాయితో 

నీకు షేపున్నది నాకు చూపున్నది 
ఊపు ఉయ్యూరు దాటిందిలే ఊర్వశీ 

తేలుకుట్టినా తెనాలిలో 

చరణం 1:

ఒంపు సొంపు చూసి వరించుకున్నా ముఖాముఖీ  

నీలో టెంపొ ఎంతో గ్రహించుకున్నా ఎకాఎకీ 

క్షమించకూ మన్మధా క్షణానికో పూపొద 
కోరీ చేరందే యవ్వనాలే ఆపదా 

ఎడారిలా నా ఎదా తడారిపోతే ఎలా 
రారా లవ్వువీరా కమ్ముకోరా నా దొరా

తేలుకుట్టినా తెనాలిలో 

చరణం 2:

చూపు ఊపు చూసా సుఖించనీరా సుమారుగా 

కన్ను ముక్కు తీరే లిఖించుకున్నా హుషారుగా 

శుభాసయా సుందరా శుభోదయం ముందరా 
పక్కే కుదరందే ఏ రాతిరైనా ఎండరా 

గోదారిలో నావలా షికారు రావే ఇలా 
బాలా ప్రియురాలా వేస్టు చేయకే వెన్నెలా 

తేలుకుట్టినా తెనాలిలో 

No comments:

Post a Comment

Leave your comments