జోడీ (1999)
సంగీతం: రెహమాన్
గానం: సుజాత, శ్రీనివాస్
రచన: భువనచంద్ర
పల్లవి :
నను ప్రేమించానను మాట..
కలనైనా చెప్పెయ్ నేస్తం..
కలకా..లం బ్రతికేస్తా..
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
పూవుల ఎదలో శబ్దం..
మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదె నా హృదయం…
ఓపదే.. నా హృదయం…
సత్యమసత్యాలు పక్కపక్కనే ..
ఉంటయ్ పక్కపక్కనే…
చూపుకి రెండూ ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే..
చూసే కళ్లు ఒక్కటే…
అయినా రెండూ వేరేలే..
నను ప్రేమించానను
చరణం 1:
రేయిని మలిచి…
రేయిని మలిచి,
కనుపాపలుగా చేసావో..
కనుపాపలుగా చేసావో,
చిలిపి వెన్నెలతొ
కన్నులు-చేశావో…
మెరిసే చుక్కల్ని తెచ్చి
వేలిగోళ్లుగ మలచి,
మెరుపుల తీగను తెచ్చి
పాపిటగా మలిచావో
వేసవిగాలులు పిల్చి
వికసించే పువ్వుని తెచ్చి..
మంచి గంధాలెన్నో పూసి
మేనిని మలిచావో..
అయినా…మగువ,
మనసుని శిలగా చేసినా..వే
వలచే… మగువ,
మనసుని శిలగా చేసినా..వే…
నను ప్రేమించానను
చరణం 2:
వయసుని తడిమి
నిదురలేపింది నీవేగా..
నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు
తెలిపింది నీవేగా..
ఓ..
గాలి నేల నింగి ప్రేమ,
ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరు..
ఓ ప్రేమా నీవేగా
గంగై పొంగే మనసు
కవితల్లె పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా-
కమ్ముకున్నది నీవేగా..
అయినా.. ప్రియుడా..
మనసుకి మాత్రం
దూరమై..నా…వే
కరుణే.. లేక
మనసుని మాత్రం
వీడిపో..యా…వే…
నను ప్రేమించానను