చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
రచన: సిరివెన్నెల
గానం: బాలు, చిత్ర
పల్లవి :
ఊగే ఊగే ఉయ్యాలా
రాగం తియ్యాలా
సాగే సాగే జంపాలా
తాళం వేయాలా
కొండాకోనా గుండెల్లో
ఊగే ఉయ్యాలా
ఊగే ఊగే ఉయ్యాలా
రాగం తియ్యాలా
వాగు వంక ఒంపుల్లో
సాగే జంపాలా
సాగే సాగే జంపాలా
తాళం వేయాలా
దొరికే చుక్కను ఏలే దొరనేనవ్వాలా
కోరితే కోరిక చూసి చిలకై నవ్వాలా
మన్నెంలో అంతా మనకేసే చూసే వేళ
ఊగే ఊగే ఉయ్యాలా
చరణం 1:
నిద్దుర చెడి మధనపడి
మదిని లాలించాలి
ముచ్చటపడి ముద్దులతడి
మొదటి ముడవ్వాలి
ప్రతిపొదలో మనకథలే
కొత్తపూత పూయించాలి
మతిచెదిరే శృతిముదిరే
తందనాలు తొక్కించాలి
అందెలుకట్టే అందాలన్ని సందిటపట్టాలి
తొందరపెట్టే ఆరాటాన్ని ముందుకునెట్టాలి
ఏకాంతాన్నంతా మన జంటే పాలించాలి
ఊగే ఊగే
చరణం 2:
సిగన నువ్వే మొగలిపువ్వై
ఒదిగివుందువుగాని
చిలిపి నవ్వే పిలుపునిస్తే
రానా కిన్నెరసాని
కోడెనాగులా కొంటెసెగలే
చుట్టుకుని కాటెయ్యాలి
కొండవాగులా కన్నెవగలే
కమ్ముకొని కవ్వించాలి
చిటిక విని సంతోషంతో తెచ్చా సొంపుల్నీ
కలలు కనే సావాసంతో గిచ్చా చెంపల్నీ
కౌగిళ్ళో రానీ ఎదపాడే రాగాలన్ని
ఊగే ఊగే