పెద్ద కొడుకు (1973)
సంగీతం: ఆదినారాయణరావు
రచన: సినారె
గానం: ఘంటసాల
పల్లవి:
ఈనాడే దసరా పండగ
ఈనాడే దసరా పండగ
ఈనాడే దసరా పండగ
ఈనాడే దసరా పండగ
అన్ని వృత్తుల శ్రమికశక్తుల
ఆయుధపూజల పండగ
ఓ...
ఈనాడే దసరా పండగ
ఈనాడే దసరా పండగ
చరణం 1:
ఆ...
పొలిమేరలలో పొంచివున్న
పెనుదుండగీడుల గుండెలు చీల్చే
కత్తికి పూజ ఈనాడే
కత్తికి పూజ ఈనాడే
ఫ్యాక్టరీలలో ఇనుమును కాచి
పరికరాలుగా తీరిచిదిద్దే
సుత్తికి పూజ ఈనాడే
సుత్తికి పూజ ఈనాడే
రాళ్ళను చీల్చి
బీళ్ళను దున్ని
రాళ్ళను చీల్చి బీళ్ళను దున్ని
రతనాల పంట పండించే
నాగలి పూజ ఈనాడే
నాగలి పూజ ఈనాడే
సమభావనయే పునాదిగా
నవసమాజ సౌధం నిర్మించే
కలం పూజ ఈనాడే
కలం పూజ ఈనాడే
ఈనాడే ఈనాడే
ఈనాడే దసరా పండగ
చరణం 2:
ఆ...
వందలాది ఎకరాలకు
ఇకపై వారసుడొకడే ఉండడులే
అవి ఊరందరికీ చెందునులే
నోట్లబలంతో కులికేవారికి
నూకలు కూడా పుట్టవులే
నల్లరూకలు అన్నం పెట్టవులే
చెమట వడిపి పనిచేసేవాడే
శిరసెత్తుకుని తిరుగునులే
పరువుగ బ్రతుకును గడుపునులే
దరిద్రమన్నది ఈ దేశంలో
ఓ...
దరిద్రమన్నది ఈ దేశంలో
దరిదాపుల్లో నిలవదులే
ఈ పరిణామం ఇక తప్పదులే
తప్పదులే తప్పదులే తప్పదులే
ఈనాడే దసరా పండగ