October 3, 2025

పదహారేళ్ళ పాపా

ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
గానం: సుజాత మోహన్, దేబాశిష్
రచన: సిరివెన్నెల 

పల్లవి : 

పదహారేళ్ళ పాపా నీకు ఏదిష్టం
ఏదిష్టం ఏదేదిష్టం
హే పదహారేళ్ళ పాపా నీకు ఏదిష్టం
ఏదిష్టం ఏదేదిష్టం
నా పేరిష్టం
తరవాత
మా ఊరిష్టం
తరవాత
మా అమ్మిష్టం
తరవాత
మా నాన్నిష్టం
తరవాత
అన్నిటికన్నా అందరికన్నా
అన్నిటికన్నా అందరికన్నా
నువ్వంటే చాలా చాలా ఇష్టం
పదహారేళ్ళ పాపా నీకు ఏదిష్టం
ఏదిష్టం ఏదేదిష్టం

చరణం 1:

ఇండియాలోని అన్ని గుళ్లలోను
ఏదిష్టం నీకేదిష్టం
ఇండియాలోని అన్ని గుళ్లలోను
ఏదిష్టం నీకేదిష్టం

తిరుపతి ఇష్టం
తరవాత
షిరిడి ఇష్టం
తరవాత
ఉడిపి ఇష్టం
తరవాత
మదురై ఇష్టం
తరవాత
ఏ గుడికన్నా నా గుండెల్లో
ఏ గుడికన్నా నా గుండెల్లో
నువు కట్టిన గుడి ఎంతెంతో ఇష్టం

పదహారేళ్ళ పాపా నీకు ఏదిష్టం
ఏదిష్టం ఏదేదిష్టం

చరణం 2:

నాలో నీకేం నచ్చింది 
ఎంతగానో మెచ్చింది
ఏముంది అసలేముంది

నాలో నీకేం నచ్చింది 
ఎంతగానో మెచ్చింది
ఏముంది అసలేముంది

అందాల ధనం
అంతేనా
బంగారు గుణం
అంతేనా
పాపాయి తనం
అంతేనా
నీ పిచ్చితనం
అంతేనా
ఎవరేమన్నా ఏదేమైనా
ఎవరేమన్నా ఏదేమైనా
నేనంటే పడిచచ్చే నీ ప్రాణం

చరణం 3:

కన్యాదానం వేళా వరకట్నం కావాలి
ఇస్తావా నువ్విస్తావా
కన్యాదానం వేళా వరకట్నం కావాలి
ఇస్తావా నువ్విస్తావా

ఏం కావాలీ
ఏదైనా
ఏమివ్వాలీ
ఏదైనా
నువ్వడిగేది
ఏదైనా
నువ్ కోరేది
ఏదైనా
నా అణువణువూ నువ్వయ్యాక
నా అణువణువూ నువ్వయ్యాక
నాదంటూ నాలో ఇంకేముంది