లారీ డ్రైవర్ (1990)
సంగీతం: చక్రవర్తి
గానం: బాలు, జానకి
సాహిత్యం: సిరివెన్నెల
పల్లవి :
తల్లీ దండాలే..
ఓ..ఓ..ఓ..
కాళీ జేజేలే..
ఓ..ఓ..ఓ..
దసరా వచ్చిందయ్య
సరదా తెచ్చిందయ్య
దశమి వచ్చిందయ్య
దశనే మార్చిందయ్య
జయహో దుర్గాభవానీ..
హోయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ..
హోయ్
ఓ..ఓ..ఓ..
రాతిరిలో సూర్యుడినే చూడాలా...
జాతరతో స్వాగతమే పాడాలా....
చరణం 1:
ఈ జోరు పై గేరు తొక్కాలా..
చుక్కల్లు చేతుల్లొ చిక్కాలా
అమ్మోరి దీవెన్లు దక్కేలా
ముమ్మారు చెయ్యెత్తి మొక్కాలా
నింగి నేల ఉప్పొంగేలా
సంతోషాలే చిందెయ్యలా
గుళ్ళో దేవుడు సారథి కాగా
లారీ డ్రైవర్ ఓనరు కాడా
ఓ....ఓ.....ఓ...
ముచ్చటగా ముందుకురా తొందరగా..
పచ్చదనం పంచుకునే పండుగరా...
దసరా వచిందయ్య...
చరణం 2:
వాకిట్లొ చీకట్లు తొలిగేలా
చూపుల్లో దీపాలు వెలగాలా
దాగున్న దెయ్యాలు జడిసేలా
తెల్లార్లు తిరనాళ్ళు జరగాలా
మచ్చేలేని జాబిలి నేడు
ఇచ్చిందమ్మా చల్లని తోడు
నిన్నా మొన్నటి పేదల పేట
నేడో పున్నమి వెన్నెలతోట
ఓ....ఓ.....ఓ......
బంజరులో బంగరులే పండెనురో..
అందరిలో సంబరమే నిండెనురో..
దసరా వచిందయ్య
No comments:
Post a Comment
Leave your comments