రణం (2006)
రచన: సుద్దాల అశోక్ తేజ
గానం: మహాలక్ష్మి అయ్యర్, మల్లికార్జున్
సంగీతం: మణిశర్మ
పల్లవి:
వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది
వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది
కొమ్మల్లో నేడే కూకూలే మోగే
రెమ్మల్లొ దాగే పూలన్నీ మూగే
ఇలాంటి చోటే ఎపుడుంటే ఇక హాయే
వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది
వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది
చరణం 1:
జామపండు చిలకే కొరికి రుచిని తెలిపింది
ఈ అతిథికి ఇమ్మంది
జున్నుపాలు చక్కర వేసి తినమని తువ్వాయి
తన భాగము ఇమ్మంది
చూడు చూడు గువ్వ తల్లి
గోరు ముద్దలాగా నోరు ముద్దలు
చేనులోకి తొంగి చూడు చాటు మాటు
సాగే తీపి ముద్దులు
ఇదంతా చూసి మతే పోతుంది
నిజంగా ఊరే భలేగా ఉంది
ఇలాంటి చోటే ఎపుడుంటే ఇక హాయే
వారెవ్వా చందమామ
చరణం 2:
ఒంపులు తిరిగి ఊగే జడతో పోటీ పడుతుంది
ఈ కదిలే సెలయేరు
కెంపుల పెదవి ఎరుపే చూసి కునుకే పోనంది
మా నిదుర గన్నేరు
చుక్కలున్న చిన్న మేక
జింకపిల్లలాగా దూకమన్నది
రెక్క రెక్క నొక్కుతున్న
పావురాల వంక చూడమన్నది
ఇలా నీతోనే ఖుషి చేస్తుంటే
వసంతలెన్నో తలొంచి రావా
ఇలాంటి చోటే ఎపుడుంటే ఇక హాయే
వారెవ్వా చందమామ