నవయుగం (1983)
సంగీతం: చక్రవర్తి 
రచన: భానూరి సత్యనారాయణ, 
గానం: సుశీల బృందం
పల్లవి : 
అక్కో...అక్కా 
అక్కో అక్కో అక్కా 
మీ చెల్లెళ్ళమొచ్చినమక్కా  
చుట్టపుచూపుగ అక్కో 
మీ ఇంటికి రాలేదక్కా 
నీ కష్టపు బతుకులు అక్కో 
కడతేర్చుటకొచ్చినమక్కా 
ఇక చింతలు వీడి అక్కో 
పోరాటం చెయ్యే అక్కా
అక్కో 
అక్కో అక్కో అక్కా 
మీ చెల్లెళ్ళమొచ్చినమక్కా
అక్కో అక్కో అక్కా 
పోరాటం చెయ్యవె అక్కా 
చరణం 1:
చెమటలు కక్కుతు అక్కో 
నువ్ చాకిరి చేస్తే అక్కా 
చారెడు గింజలు అక్కో 
నీ చాటన బడవే అక్కా 
పొయ్ కిందకు ఉంటే అక్కో 
పొయ్ మీదకు ఉండదె అక్కా 
పండగపూటైనక్కో 
నీకు పస్తులు తప్పవె అక్కా 
అక్కో 
అక్కో అక్కో అక్కా 
మీ చెల్లెళ్ళమొచ్చినమక్కా
అక్కో అక్కో అక్కా 
పోరాటం చెయ్యవె అక్కా 
చరణం 2:
చస్తూ బతుకుతు అక్కో 
పై చదువులు చదవేరక్కా 
కొలువుల వేటలొ అక్కో 
ఓరయ్యను చేరితె అక్కా 
తన తల్లి, చెల్లి అక్కో 
ఆడోళ్ళని మరచీ అక్కా 
నిన్నెగదిగ చూసీ అక్కో 
నీ మానం కోరెను అక్కా 
అక్కో 
చరణం 3:
వరకట్నపు సంతలో అక్కో 
అరె వేలంపశువు అక్కా 
కట్టిన తాళి అక్కో 
ఉరితాడైపోయెను అక్కా 
కట్నం ఏదని అక్కో 
మరి కానుకలేవని అక్కా 
వాడు కిరసను పోసి అక్కో 
నిను కాల్చి చంపెనే అక్కా 
అక్కో 
చరణం 4:
పల్లెపడుచుకు అక్కో 
మాయమాటలు చెప్పి అక్కా 
అరె పట్నం జేర్చేరక్కో
వెలయాలిని జేసేరక్కా 
జానెడు గుడ్డే అక్కో 
ఆ చెల్లికి కట్టారక్కా 
అది సిగ్గుతొ చచ్చే అక్కో 
వాళ్ళు చిందులు వేసారక్కా  
అక్కో 
చరణం 5:
అర్ధరాతిరి అక్కో 
ఆడకూతురు వంటరిదక్కా 
రాగలిగిన రోజే అక్కో 
సొరాజ్యం నిజమని అక్కా 
బాపూజీ కలలే అక్కో 
వీళ్ళు కల్లలు చేసారక్కా 
సిగ్గు సిగ్గు ఇది అక్కో 
మన జాతికి ముప్పే అక్కా 
అక్కో 
చరణం 6:
దేశభక్తిలో అక్కో 
ఝాన్సమ్మకు సాటి అక్కా  
అరె పౌరుషంలోన అక్కో 
రుద్రమ్మకు ధీటే అక్కా  
తమ హక్కులు ప్రీతని అక్కో 
మరి మహిళకు స్వేచ్చని అక్కా 
ఎరుపెక్కి పోరుదామక్కో 
ఎర్రబాటను సాగుదమక్కా 
No comments:
Post a Comment
Leave your comments