October 2, 2025

తెలిసిందా బాబూ

దొంగ రాముడు (1955)
రచన: సముద్రాల సీనియర్
సంగీతం: పెండ్యాల
గానం: సుశీల 

పల్లవి : 

తెలిసిందా బాబూ
ఇపుడు తెలిసిందా బాబూ
తెలిసిందా బాబూ
ఇపుడు తెలిసిందా బాబూ
అయ్యవారు తెలిపే నీతులా 
ఆలించకపోతే వాతలే 
తెలిసిందా బాబూ...

చరణం 1:

అల్లరిపిల్లల కూడవుగా 
గిల్లీకజ్జాలాడవుగా 

ఓ . ..
ఇక వేయవుగాదా ఈతలు 
తెగ కోయవుగాదా కోతలూ 
బాగేమిటో ఓగేమిటో నీకిపుడైనా 
తెలిసిందా బాబూ...

చరణం 2:

చదువుకు సున్నాచుట్టవుగా
గురువుకు నామంపెట్టవుగా 

ఓ . ..
పొరపాటు పనికి పోవుగా
మరియాదకు లోటూ తేవుగా 
బాగేమిటో ఓగేమిటో నీకిపుడైనా 
తెలిసిందా బాబూ...

చరణం 3:

వినయముమీరా తల్లిపదాలను 
దినమూ కొలవాలి 
ఆహా దినమూ కొలవాలి 

మనసున చెల్లెలి మాట మరువకా 
మన్నన చెయ్యాలి
ఆహా మన్నన చెయ్యాలి

ఓ . ..
ఇరుగూ పొరుగూ సెబాసన 
పరువెరిగీ నీవూ మెలగాలి 
మన వూరికీ, మనవారికీ పేరు తేవాలి 
తెలిసిందా బాబూ...