చిత్రం: దొంగ రాముడు (1955)
సాహిత్యం: సముద్రాల సీనియర్
సంగీతం: పెండ్యాల
గానం: సుశీల
పల్లవి :
ఆ..ఆ ఆ ఆ....
అనురాగము విరిసేనా
ఓ..రేరాజా
అనుతాపము తీరేనా
వినువీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా
ఓ..రేరాజా
అనుతాపము తీరేనా
చరణం 1:
నిలిచేవొ మొయిలు మాటున
పిలిచేవో కనుల గీటునా
నిలిచేవొ మొయిలు మాటున
పిలిచేవో కనుల గీటునా
పులకించు నాదు డెందము
ఏనాటి ప్రేమాబంధమో
ఓ..రేరాజా
అనురాగము విరిసేనా
చరణం 2:
మునుసాగే మోహాలేమో
వెనుకాడే సందేహాలేమో
మునుసాగే మోహాలేమో
వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమొ తేటగా
తెనిగించవయ్యా మహారాజా
ఓ..రేరాజా
అనురాగము విరిసేనా