రణం (2006)
గీత రచన: బాషాశ్రీ
గాయకులు: టిప్పు, అనురాధా శ్రీరామ్
సంగీత: మణిశర్మ
పల్లవి :
హే చిన్నా రా చిన్నా
హే చిన్నా రా చిన్నా
అంబ పలుకుతుందే
నాతొ పెట్టుకుంటె చిలకా
దిమ్మతిరిగిపోద్దే
దెబ్బ కొట్టానంటే గనకా
కళ్ళు తిరిగిపోవా చిన్నా
పెట్టాడంటే మడతా
పంబ రగిలి పోదా
చుమ్మా ఇచ్చాడంటే చిరుతా
చిన్నమ్మీ వత్తావా
సంగతే సూత్తావా
నీ వంట్లో నరం నరం వేగిపోతాదే
అందుకే మెచ్చారా
నీ వెంటే వచ్చారా
నువ్వంటే పడి పడి చచ్చిపోతారా
హే చిన్నా రా చిన్నా
హే చిన్నా రా చిన్నా
చరణం 1:
మీసముంది రోషముంది
దుమ్ములేపే దమ్ము నాకుంది
దాగుంది
మత్తుగుంది మస్తుగుంది
దూసుకొచ్చిన మోజు బాగుంది
నచ్చింది..
ఓ గుడుగుడుగుంజమా
చెయ్ చూడవే చించిమా
చిర్రుబుర్రులాడినా
చిత్తడవులే భామా
గడబిడ నారదా
ఏందిరసలు గొడవా
కలబడి సూడరా
చెడుగుడేల బావా
అమ్మ నీ యవ్వారం
దాటెనే గుడారం
వెర్రెక్కి చిటాపటా పేలుతున్నావే
ఓరినా బంగారం
నచ్చితే విడ్డూరం
వత్తావా తాడోపేడో తేల్చుకుందాము
హే చిన్నా రా చిన్నా
హే చిన్నా రా చిన్నా
చరణం 2:
కాలికేస్తే ఏలికేసి
ఏలికేసి కాలికేస్తావా?
ఓయ్ చిన్నా వా
అన్న చాటు చిన్నదానా
సందు చాటున సంధికొస్తావా
హే వస్తావా
హే మెరుపుల నాయకా
దూకుడాపర నువ్వికా
నలుగురు చూసినా
నవ్విపోతారు.. వావా
గొణుగుడు గోపికా
సణుగుడాపవె నువ్వికా
సలసల రేయిలో
సరసమాడె భామా
పిల్లడా అట్టాగా
సంబడం సూత్తాగా
అల్లుడై ఇంటికొచ్చి ఏలుకుంటావా?
పిల్లా నే వత్తానే
పల్లకే తెత్తానే
ఊ అంటే
పిప్పి డుమ్ డుమ్ వాయించేద్దామే
హే చిన్నా వాఁ చిన్నా
హే చిన్నా వాఁ చిన్నా
చుమ్మా….