చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపథ్యగానం: బాలు, చిత్ర
పల్లవి :
పుత్తడిబొమ్మకు సెగలు చుట్టే
ముద్దులగుమ్మకు దిగులుపుట్టే....
పన్నీటిస్నానాలు చేసే వేళలో...
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో...
చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ
చేయూత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమసామ్రాజ్య దేవీ...
పుష్పం పత్రం స్నేహం దేహం
సమర్పయామీ
నీ కన్యాధనం కాపాడగ నాదేలే హామీ
సరేనంటే రూపం తాపం
సమర్పయామీ
నీ సన్నిధిలోనే సమస్తము...
నివేదయామీ
చరణం 1 :
కునుకుండదు కన్నులలోనా...
కుదురుండదు గుండెలలో..
అణువణువు కొరుకుతున్నది...
తియ్యని మైకం...
ఎదిగొచ్చిన వన్నెలవాన...
ఒదిగుండదు వంపులలో
చెరనొదిలి ఉరుకుతున్నది ...
వయసు వేగం
మనసు పడే కానుకా...
అందించనా ప్రేమికా..
దహించితే కోరికా...
సహించకే గోపికా
అదిరేటి అధరాల ఆనా...
అందం చందం అన్ని నీకే...
సమర్పయామి
ఆనందమంటే చూపిస్తాలే...
చెలి ఫాలో మీ
పుత్తడిబొమ్మకు...
చరణం 2 :
నులివెచ్చని ముచ్చటలోన...
తొలిముద్దులు పుచ్చుకొనీ
సరిహద్దులు దాటవే
ఒంటరి కిన్నెరసానీ
నును మెత్తని సోయగమంతా...
సరికొత్తగ విచ్చుకునీ
ఎదరొచ్చిన కాముని సేవకు
అంకితమవనీ
అవీ ఇవీ ఇమ్మనీ...
అదే పనిగ వేడనీ
ఇహం పరం నువ్వనీ...
పదే పదే పాడనీ
తెరచాటు వివరాలు అన్నీ...
దేహం దేహం తాకే వేళ...
సంతర్పయామీ
సందేహం మోహం తీరేవేళ...
సంతోషయామీ
పుత్తడిబొమ్మకు సెగలుపుట్టే