December 22, 2020

బందారు చిన్నదాన



బందారు చిన్నదాన
రక్తాభిషేకం (1988)
ఇళయరాజా 
వేటూరి 
బాలు, చిత్ర

పల్లవి:

బందారు చిన్నదాన
బాజాబందూల దాన
బాజాబందూల మీన 
బంతిపూలు సోకే 
ఓ చిన్నదాన...

సోకో 
అమ్మాడి పూతరేకో 
కంగాళి కోక కాకొచ్చి 
తగిలే ఓ చిన్నదాన...

కట్...కట్...కట్ 
ఏమిటయ్యా ఈ స్టెప్పింగులు 
ఇవా స్టెప్పింగులంటే...
అభిమానసంఘాలు 
మన దుంపతెంపేస్తారు 
జాగ్రత్త 
ఇదిగో నువ్వేయవయ్యా 
నువ్వేయ్..
వన్...టూ...త్రీ..ఫోర్..

గుంటూరు చిన్నవాడ 
గులుకూ కన్నూలవాడ 
గులుకూ కన్నూలతోటి 
గుండె కొల్లగొట్టే 
ఓ చిన్నవాడ    

చిందో 
లే గున్నమావి చింతో 
నా కన్నె ఒడి  సంతో 
నీ పరమే 
ఓ చిన్నవాడ

చరణం 1:

ఎదుగుతున్నా ఆ ఎత్తులూ 
సొగసుగున్నా నా సొత్తులూ 
చిగురువేసే నీ సోకులూ 
పొగరు చెట్టు మారాకులూ 

ఆ మాట నువ్వంటే సిగ్గేస్తది 
నా పైట గుట్టంతా ఒగ్గేస్తది 
అంటే అన్నావుగాని పిల్లోడా 
అంతా కాజేసి పోబోకోయ్ 
ఇన్నీ అందాలు ఒగ్గి 
నేనేడ కెళతా ఓ చిన్నదాన...

చరణం 2:

తలకుపోసు కొచ్చానయ్యో 
తలుపుతీసి ఉంచానయ్యో 
నులకమంచం వేసానయ్యో 
ఉలవచారు కాసానయ్యో 

అట్టంటే నా కోడి కూసేస్తది 
చిట్టింటి నీ గింజ మేసేస్తది
అంతా బాగున్నకాడ ఓలమ్మీ 
సంత బేరాలు వద్దమ్మీ 

ఇన్ని వాటాలు చూసి 
నేనేడకెళతా ఓ చిన్నవాడా...