January 6, 2021

అక్షరాల ఆశయాలు



అక్షరాల ఆశయాలు..
ఇదా ప్రపంచం (1987)
వెన్నెలకంటి
చక్రవర్తి
బాలు, మనో

పల్లవి: 

అక్షరాల ఆశయాలు..
ఉద్యమాల లక్ష్యాలు
చింపబోతె చిరగబోవురో..
చంపబోతె చావబోవురో

అక్షరాల ఆశయాలు..
ఉద్యమాల లక్ష్యాలు
చింపబోతె చిరగబోవురో..
చంపబోతె చావబోవురో

చరణం 1: 

రాజకీయ పిశాచాలు స్వతంత్రంగ కులకాలని
కులం పేరు కుక్కించి..
మతం మందు ఎక్కించి
బుద్ధినిచ్చె చదువు మీద బురద చల్లుతున్నారు
కుర్రోళ్ళను వెర్రోళ్ళుగ కూడతిప్పుతున్నారు
ఆ వెంటబోతె అంటుజబ్బురో..
అది అంటుకుంటె కుంటిబతుకురో

చరణం 2:

దేశమన్న నేలమీద ధ్యానమన్న మొక్క నాటి
భాగ్యాలను పండించే విద్యార్ధుల విలువల్ని 
దోపిడీకి బలిపెట్టి..దోచుకునే దొంగలంతా
నిరుద్యోగమన్న బిక్ష నీకు చేతికిస్తుంటే
భవితవ్యం బాట మూతరో..
చైతన్యం చీకటేనురో....

చరణం 3:

ఓటులకై మంత్రులంత..
బూతులతో ఒకరినొకరు
అమ్మ ఆలి పరువు తీసి 
అంగడిలో పెడుతుంటే
సంస్కారం ఎక్కడుందీ..?
సమసామ్యం ఏముందీ..?
ఈ పందుల కుమ్ములాటలో..
ఎందుకొరకు ఓటులేస్స్తరో

చరణం 4:

చదువుతల్లి బిడ్డలైన 
విద్యార్ధుల లోకంలో 
తుచ్ఛులొచ్చి ఉచ్చులేసి .. 
విచ్చిన్నం చేయబోతే
అల్లూరులు, ఝాన్సీలు, భగత్ సింగ్, సుఖదేవులు
శ్రీశ్రీలు, గురజాడలు మాలోనే బయల్దేరి
పిడుగుల్లా ప్రతిఘటించి గడగడలాడిస్తారు
ఖబడ్దార్ ద్రోహులారా.. 
ఖబడ్దార్...
ఖబడ్దార్...
ఖబడ్దార్...
ఖబడ్దార్