December 13, 2020

ఓ మైనా... కోపం చాలు



ఓ మైనా... కోపం చాలు
ఖైదీ వేట (1984)
సంగీతం: ఇళయరాజా 
గానం: బాలు, శైలజ 
రచన: రాజశ్రీ 

పల్లవి:

ఓ మైనా....కోపం చాలు
ఓ మైనా....కోపం చాలు
నీకీ పంతము 
కాదే న్యాయమూ 
రోజా ఏలనే 
ముల్లై పోయెనే 
ఓ మైనా కోపం చాలు
ఓ మైనా కోపం చాలు

చరణం 1:

కన్నెప్రేమనే ఖైదులో నిలిచితీ... రా....

కథలు చెప్పకా...చాలు ఈ గౌరవం...పో 

రెండుకళ్ళలో ఒకటి ఒకటినీ కోపగించునా...?

చాలీ సరసం... వలదీ స్నేహం 

కోపం కూడా చెలికే అందం 

నీడై వస్తే పోదా కోపం ఓహో...

చరణం 2:

కోటి ఆశలే నిండెనే మనసులో...రా....

నిండుపున్నమీ కళ్ళలో పంచానీ...వా 

ఊహ పెరిగెనే నేటి ప్రేమలో కలలు విరిసెనే 

కదిలే బంధం నదిలా చూడూ 

అందం పాడే రాగం నేడూ 

వలపే ముద్దూ అల్లరివేళా ఓహో... 

ఓ మైనా....కోపం చాలు
ఓ మైనా....కోపం చాలు
కోరే ముచ్చట
తీరే ఇచ్చటా 
నేనే కానుకా 
నీకే వేడుకా