నీ కథ ఇది
జింబో (1959)
రచన: శ్రీశ్రీ
సంగీతం: చిత్రగుప్త, విజయ భాస్కర్
గానం: సుశీల
నీ కథ ఇది కల కాదూ
ఈ ప్రణయమె విడరాదూ!
హృదయంలో కెరటాలు
జలపాతములై రేగే!
కారణమే లేదాయె
నా ప్రాణమె నీదాయె!
హృదయ విహంగమ్మెగిరీ
చేరినదీ చిన్నారి
ఈ చిలకను విడరాదే!
దెసదెసలా పరిమళమే
చాటెను నీ మాట!
పరిగెడునీ కరిరాజే
తన బాటనే తలయూచి!
మెఱసెడి ఈ పుష్పాలే
పులకించెను నిను జూచి!
ఈ రమణీ నీ దరినీ
ఆడెను నీ ఆటా....!
నీ జగమిది కల కాదూ
ఈ ప్రణయమె విడరాదూ!
ఈ జగమేలెడు వారే
ఎరుగరు నీ మాయా!
నా మది నీయది కాదే
నేనెరుగుదు నీ భాషా!
ఈ లలనా లాలనగా
పాడెను నీ పాట!