అభినవ కుచేల
కలెక్టర్ జానకి (1972)
రచన: సినారె
సంగీతం: వి. కుమార్
గానం: బాలు, పట్టాభి భాగవతార్
శ్రీమద్రారమణ గోవిందో హారి...!
ఆ ప్రకారంగా...
దరిద్రనారాయణ బిరుదాంచితుండు
జీర్ణవస్త్ర నిత్యాలంకృతుండు
ట్వెంటీసెవెన్ పుత్రపుత్రికా
పరివేష్టిత కుటీరుండు
బ్రహ్మశ్రీ కుచేలుండు...
తమకు తెలిసిన కథే...!
ఒకానొక దివసంబున వికలమానసుండై ఉండగా
అతని అర్ధాంగి 'మిసెస్ వామాక్షీ కుచేల'
ఏమని వైజ్ అడ్వయిజు చేసిందయ్యా అంటే...
చింతించకో ప్రాణనాథా...
చింతించకో ప్రాణనాథా...
నేను చెప్పింది చేసిన తీరును మన బాధ..
సీటు కావాలన్నా... ఓటు కావాలన్నా..
సీటు కావాలన్నా... ఓటు కావాలన్నా..
వాటముగా..ఆ..
బస్సు రూటు కావాలన్నా...
పర్మిట్లు కావాలన్నా..ప్రమోషన్లు కావాలన్నా
ఆహాఁ...పర్మిట్లు కావాలన్నా..ప్రమోషన్లు కావాలన్నా
ఎవ్వరో ఒక పెద్దవారిని
ఆశ్రయించి ఆదరణ పొందవలె
చింతించకో ప్రాణనాథా...
నాయనలారా శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కదలదు
సిఫారసే లేకుంటే చిన్న ఫైలైనా జరగదు
ఎక్సూజ్ మీ
చిన్న పనైనా జరగదు
కాబట్టి...ద్వారకానగరి దారిబట్టి...
నీ క్లాసుమేటు బాలకృష్ణుని
గోపాలకృష్ణుని...
ఆబాల గోపాలకృష్ణుని
ఇంటర్వ్యూ సంపాదించి
మన దరిద్రం వదిలించమని
ప్రార్ధించవయ్యా...
ఆ......
ఓహో... వండర్ ఫుల్ రా శిష్యా...
ప్రార్ధించవయ్యా అని
తన సతీమణిచేత సలహాకృతుండై కుచేలుండు
ఎట్టకేలకు ద్వారకాపట్టణమున కరిగి
తద్వైభవమునుగాంచి తల..ది..రి..గి..
సోడా గురూ..!
థ్యాంక్స్ రా శిష్యా థ్యాంక్సు..!
ఆ..ఎక్కడున్నాం?
తలదిరిగి తద్వైభవమునుగాంచి...
ఆహా...తద్వైభవమునుగాంచి తలదిరిగి..
ఆహా... ఏమి శోభ! ఏమి శోభ! శోభా!
ఏవండీ పిలిచారా?
ఉష్షు ...రామాయణంలో పిడకలవేట
ఆ తద్వైభవమునుగాంచి తలదిరిగి..
కృష్ణపరమాత్ముని గని కరిగి పరవశించు
కుచేలుని గని
పరంధాముడేమన్నాడయ్యా అంటే...
వచ్చితివా బాల్యమిత్రమా!
ఏమి తెచ్చితివో నాకు చెప్పుమా!
కాశ్మీరు శాలువైనా తేలేదా!
గాడ్రేజి బీరువైనా తేలేదా!
ప్రెషరు కుక్కరు కొని రాలేదా!
కుట్టుమిషనైన మోసుకు తేలేదా?
దండైన... యాపిల్ పండైనా
దండైన... యాపిల్ పండైనా
ఆంధ్రా ఫేమసు బందరు లడ్డైనా
అంతో ఇంతో అర్పించనిదే...
అనుకున్న పని అసలే జరగదు
వచ్చితివా బాల్యమిత్రమా!
ఏమి తెచ్చితివో నాకు చెప్పుమా!
ఆ...
ఆ పలుకులు విని
సిగ్గుతో ముడుచుకుపోయిన కుచేలుని
ఒడలంతా తడిమి
ఉత్తరీయపు కొంగున ఉన్న
అటుకులమూట పరికించి..
తటాలున ఆరగించి...
తృప్తిగా త్రేన్చి...బ్రేవ్
ఆ కృష్ణపరమాత్మ కుచేలుని పూర్ హట్టుకు వెళ్ళి
గంపెడు పిల్లలను గాంచి
దిగ్భ్రమచెంది...
ఏవన్నాడయ్యా అంటే
కుచేలా ఇది నీ ఇల్లా
లేక మున్సిపల్ స్కూలా
అయ్యయ్యో అష్టభార్యలున్న
నాకే ఇందరు పిల్లలు లేరే...
బాపురే నీకెందుకయ్యా
ఇందరు పిల్లలని...
కృష్ణపరమాత్మ కుచేలునితో
చివరిసారిగా ఏవన్నాడయ్యా అంటే...
ఆ..
ఇద్దరు లేకా ముగ్గురు చాలని వినలేదా!
ఇందరు పిల్లల కనడం నీకు మరియాదా?
ఇద్దరు లేకా ముగ్గురు చాలని వినలేదా!
ఇందరు పిల్లల కనడం నీకు మరియాదా?
ఇప్పటికైనా తెలుసుకో! నీ తప్పును
వెంటనే దిద్దుకో...
ఇప్పటికైనా తెలుసుకో! నీ తప్పును
వెంటనే దిద్దుకో...
స్టాప్...స్టాప్...స్టాప్...స్టాప్...
అయ్యా మృదంగ విద్వాన్ నువ్వుకూడా స్టాపు...
ఈ ప్రకారంగా దివ్యవాణి ప్రభోదించగా
ఆకాశవాణి ఏమని శృతి కలిపిందయ్యా అంటే
ఎఱ్ఱ త్రికోణం...ఎఱ్ఱ త్రికోణం...ఎఱ్ఱ త్రికోణం
ఎఱ్ఱ త్రికోణం...ఎఱ్ఱ త్రికోణం...ఎఱ్ఱ త్రికోణం
శ్రీమద్రారమణ గోవిందో హారి...!