సప్పుడైన సెయ్యలేదే
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మనో, స్వర్ణలత
పల్లవి:
సప్పుడైన సెయ్యలేదే
ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే..
హే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటె
అక్కడొచ్చి కూర్చుందే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు
చెప్పకుండ చేరినాడే
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే...
హోయ్..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
చరణం 1:
ఓయ్..చేపకళ్ళ చూపులో
కోపమెంత చూపినా
నవ్వినట్టే ఉంటాదే
నా పిల్లచూడు..నా పిల్లచూడు
మద్ది మాను తీరునా
మొద్దు మాదిరుండినా
ముద్దు గానే ఉంటాడే నా పిల్లగాడు.. నా పిల్లగాడు
సింగమంటి పిల్లగాడు
జింకపిల్ల లాంటి నాకు
వంగి లొంగి పోయాడే
.........
సూడబోతే పూలరేకు
పట్టబోతే పిడిబాకు
టక్కులెన్నొ నేర్చిందే
.....
చరణం 2:
హొయ్....
ఒక్కమారు అంటాడే....
గుక్క తిప్పుకోనీడే
సిగ్గు బుగ్గి చేస్తాడే నా పిల్లగాడు
నా పిల్లగాడు... నా పిల్లగాడు
ఎన్ని సెప్పు వింటది
నిన్ను తిప్పుకుంటది
గుట్టు సెప్పనంటుంది
నా పిల్ల సూడు
గుమ్మపాల పొంగులో
గట్టు దాటు గంగలా
మతి సెడగొడుతుందీ..
నువ్వు తప్ప నాకు
దిక్కు మొక్కు లేదంటూ...
ఒట్టేసి చెబుతాడే..