కించిత్ కించిత్
చిత్రం : సమ్రాట్ అశోక (1992)
సాహిత్యం : సినారె
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
గానం : బాలు, చిత్ర
పల్లవి:
కించిత్ కించిత్ కిలికించితం....
స్వా౦తం సాంతం మదనాంకితం...
కించిత్ కించిత్ కిలికించితం....
స్వా౦తం సాంతం మదనాంకితం...
నీ ప్రేమలో...నీ పదసీమలో
నిలువెల్ల పులకాంచితం
నా నిలువెల్ల పులకాంచితం
నీ ప్రేమలో... నీ పదసీమలో
నిలువెల్ల పులకాంచితం
నా నిలువెల్ల పులకాంచితం
కించిత్ కించిత్ కిలికించితం....
చరణం 1:
నా మానసం నీ ప్రణయబింబితం
నీ యవ్వనం నా అధర చుంబితం
నా మానసం నీ ప్రణయబింబితం
నీ యవ్వనం నా అధర చుంబితం
నా స్పందనం నీ నయనభాషితం
నీ సంగమం నిత్య రసరంజితం
నా స్పందనం నీ నయనభాషితం
నీ సంగమం నిత్య రసరంజితం
నీ పొందులో....ఈ ఎద చిందులో...
అణువణువు లయలాలితం...
నా అణువణువు లయలాలితం....
నీ ప్రేమలో... నీ పదసీమలో
నిలువెల్ల పులకాంచితం
నా నిలువెల్ల పులకాంచితం
చరణం 2:
నీ శౌర్యమే వీరనీరాజితం..
ఈ విశ్వమే నీ యశోభూషితం...
నీ శౌర్యమే వీరనీరాజితం..
ఈ విశ్వమే నీ యశోభూషితం...
నీ అందమే చంద్రికాదీపితం..
నీ మౌనమే..
నీ మౌనమే నా మధుకూజితం..
నీ నీడలో కౌగిలి మేడలో
ఈ జన్మ పూర్ణార్పితం
నా ఈ జన్మ పూర్ణార్పితం
కించిత్ కించిత్ కిలికించితం....
స్వా౦తం సాంతం మదనాంకితం...
నీ ప్రేమలో...నీ పదసీమలో
నిలువెల్ల పులకాంచితం
నా నిలువెల్ల పులకాంచితం