సిరిదేవి సింగారి
చిత్రం: గృహప్రవేశం (1988)
సంగీతం: సత్యం
గీతరచయిత: జాలాది రాజారావు
నేపధ్య గానం: బాలు
పల్లవి:
సిరిదేవి సింగారి సిలకా
సిరిమల్లె సొగసైన నడకా
అమ్మరో అందాలబొమ్మా...
చరణం 1:
సూరీడు నుదురెక్కితే
అల్ల సిరిలక్ష్మి నవ్విందట
సెంద్రయ్య శిరమెక్కితే
శివగంగ పొంగిందట
శివధనస్సు చేబట్టితే
అల్ల సీతమ్మ కులికిందట
ఉమరాజు డమరాలలో
అల్ల హిమరాణి ఆడిందట
కలలన్ని నిజమైతే పున్నమేనంట
జలతారు ఎన్నెల్ల జల పాలెనంటా
చరణం 2:
నడియేటి నడకంటిది
బతుకు పగడాల పడవంటిదీ...
అడుగడుగు సుడిగుండమై...
అల్లాడి పోతుంటదీ హా...
వయసేమొ వరదంటిదీ
దాని సొగసెమొ నురగంటిదీ
అరిటాకు కెరటాలలో
ఆటాడి పోతుంటదీ
ఏ గురుడు చేసాడొ ఆ పడవ సేత
ఏ బెమ్మ రాసాడొ ఈ బొమ్మ రాత
చరణం 3:
నెలవంక వెలిగిందటా
కలికి కులదీపమయ్యిందటా
రాకాసి ఆకాశమే
రాహువై మింగిందటా
పసిగుండె పరితాపమే
అల్ల సితిమంటలయ్యిందటా
శోకాలె తనలోకమై
ఏకాకి ఏడ్చిందటా
గుడిలాటి గుండెల్లొ
బడవానలూ రేగి
బంగారు తొలిమల్లె
బతుకాయెనంటా