ఔను నిజం ప్రణయరథం
జింబో (1959)
రచన: శ్రీశ్రీ
సంగీతం: చిత్రగుప్త, విజయ భాస్కర్
గానం: సుశీల
ఔను నిజం ప్రణయరథం
సాగెను నేడే
కోరిన కోరిక పారటలాడే!
ఇంపారే పూల నిండారే సుధల్
సైదోడై చేరి దాగుండే జతల్
హాయి జనించే! ఆశ రహించే!
ప్రేమకళా ధాముడే, తారే నిజం
మన్మధుడై బాసటై ఎత్తే ధ్వజం!
బాణమె తీసే! గారడి చేసే!
హా సఖా! నా సఖా! నెమ్మది లేదే...
కెరటాలే లీనమై సరసాలాడున్
తీయని గానమె ఎదనూగాడున్
మనమె హసించున్
వనమె సుమించున్
దేహమె డెందమే తేలిక కాదే