December 11, 2020

ఓయమ్మో ఎట్టా



ఓయమ్మో ఎట్టా 
చిత్రం :  ప్రతిభావంతుడు (1986)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆత్రేయ
నేపధ్య గానం :  రాజ్ సీతారామ్, సుశీల  

పల్లవి:

ఓయమ్మో ఎట్టా
ఓయమ్మో ఎట్టా
ఈ చలిగాలిలో 
చోటిస్తే తప్పా 
నీ కౌగిళ్ళలో 

ఓయమ్మో ఎట్టా
ఓయమ్మో ఎట్టా
ఈ చలిగాలిలో 
చోటిస్తే తప్పా 
నీ కౌగిళ్ళలో 

ఓయమ్మో ఎట్టా

చరణం 1:

నీ కౌగిటా కరిగేవేడిలో
నా వయసు తాపాలు చల్లారనీ 
 
నీ సందిటా కలిగే మగతలో 
నా కనులు మత్తెక్కి అరమూయనీ...

నా పెదవికి తీరదు నీ పెదవులతో పోరాటం 

ప్రతి రేయీ చేసే అల్లరికెందుకు ఆరాటం 

చరణం 2:

నీ మగసిరీ నాకే సొంతమై 
నీ మేను ఎదపైన కొలువుండనీ 

నా గొంతులో పలికే రాగమై
వేవేల నీ పాట వినిపించనీ....

ఋతువేదైనా వలచిన కౌగిట మధుమాసం 

బిగికౌగిలిలోనా ముద్దుకుముద్దే బహుమానం