కేరింత ఊరింత


చిత్రం : మైఖేల్ మదన కామరాజు (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర

పల్లవి: 

ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం

గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ

కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం

అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీకోసం

గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...


గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో... 
నా ఇల్లు (1953)
సంగీతం: చిత్తూరు వి. నాగయ్య, ఏ. రామారావు
గానం: గానసరస్వతి బృందం
రచన: దేవులపల్లి 

గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో... 
గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...
వచ్చేనమ్మా సంక్రాతి 
పచ్చని వాకిట చేమంతి 
వచ్చేనమ్మా సంక్రాతి 
పచ్చని వాకిట చేమంతి 

ముంగిట రంగుల ముగ్గుల్లో 
ముద్దాబంతి మొగ్గల్లో 
ముద్దియలుంచే  గొబ్బిళ్ళో
గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో... 

గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో


తల్లిదండ్రులు (1970)
సంగీతం: ఘంటసాల
గానం: జానకి బృందం
రచన: శ్రీ ప్రయాగ

పల్లవి:

గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు 
ఆదీలక్ష్మి అలమేలమ్మకు అందామైన గొబ్బిళ్ళు

గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు 
ఆదీలక్ష్మి అలమేలమ్మకు అందామైన గొబ్బిళ్ళు

తెలుగు సినిమా పాటల్లో ముక్తపదగ్రస్తాలంకార ప్రయోగం

ముక్తపదగ్రస్తాలంకారం:
ముక్తం-విడిచిపెట్టిన పదం, గ్రస్తం-తిరిగి స్వీకరించడం. అంటే ఒక పాదంలో ఉపయోగించిన చివరి పదాన్ని తరువాతి పాదం మొదట్లో తిరిగి ఉపయోగించడం. 

ఉదాహరణ: 

తీర్థ సంవాసు లేతెంచినారని నిన్న నెదురుగా నేగు దవ్వెంతయైన, (అల్లసాని పెద్దన, మనుచరిత్రము.)
నేగి తత్పదముల కెరగి ఇంటికి దెచ్చు, 
దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు, 
నిచ్చి ఇష్టాన్న సంతృప్తులుగా జేయు, 
జేసి కూర్చున్నచో జేర వచ్చు, 
వచ్చి ఇద్దరగల్గు వనధిపర్వత సరి తీర్థ మహాత్మ్యముల్ దెలియ నడుగు, 
నడిగి యోజన పరిమాణ మరయు, 
నరసి పోవలయుజూడ ననుచు, నూర్పులు నిగుడ్చు.

పన్నెండు గుర్రాల బగ్గి పోతాంది (తెలంగాణా జానపదం)
బగ్గితో మేనత్త బిడ్డ పోతాంది
బిడ్డతో బిందెడు నీళ్ళు పోతున్నాయి 
నీళ్ళతో నీరంచు చీర పోతాంది
చీరతో చిక్కుల రైకె పోతాంది
రైకెతో రత్నాల పేరు పోతాంది 
పేరుతో పెట్టెడు సొమ్ము పోతాంది  
సొమ్ముతో సోమంద గరిగె పోతాంది (పిడత)
గరిగెతో గంధపు చెక్క పోతాంది 
చెక్కతో చారెడు బుక్క పోతాంది
బుక్కతో బుడ్డెడు నూనె పోతాంది
నూనెతో నూరు సకినాలు పోతున్నాయి. 

తెలుగు సినిమా పాటల్లో అంత్యానుప్రాసాలంకార ప్రయోగం-3

అంత్యానుప్రాసాలంకారము
 
మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్యానుప్రాసాలంకారము అవుతుంది.\

తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు 

క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన. 

పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు (రాజా రమేష్, ఆత్రేయ)
రంగులన్ని రంగరించి పూత పూసినాడు
పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు
రంగులన్ని రంగరించి పూత పూసినాడు
ఆ ఘుమఘుమలు గుమ్మరించి శ్వాస నింపినాడు
నీ శ్వాస నింపినాడూ...
నీ పెదవులలో పూదేనియ పొదిగి తీర్చినాడూ...
ఎంతో రసికుడు దేవుడు...
వేదాలకైన మూలమది.. (అమరజీవి)
నాదాలలోన భావమది 
దైవాలకైన ఊయలది.. 
కాలాలకన్న వేదమది 
కన్నీళ్ళు మింగి బ్రతికేది.. 
అది లేనినాడు బ్రతుకేది 
నీకై జీవించి.. 
నిన్నే దీవించి.. 
నీకై మరణించు.. 
జన్మజన్మల ఋణమీ ప్రేమ 

ఓదార్పుకన్న చల్లనిది.. 
నిట్టూర్పుకన్న వెచ్చనిది 
గగనాలకన్న మౌనమిది.. 
అర్చనగా..ద ద ద ని 
అర్పణగా.. ని ద ని స.. 
దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ

తెలుగు సినిమా పాటల్లో అంత్యానుప్రాసాలంకార ప్రయోగం-2

అంత్యానుప్రాసాలంకారము
 
మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్యానుప్రాసాలంకారము అవుతుంది.\

తెలుగు చిత్రాల్లోని పాటల్లో మరి కొన్ని ఉదాహరణలు 

క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన. 

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే (పద్మవ్యూహం)
మాట లేకున్నను భాష ఉంటుందిలే
ప్రేమయే లేకపోతే జీవితం లేదులే

వాసనే లేకనే పూలు పూయొచ్చులే
ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే?
నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఎదో అందిలే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా
ఓ మనసా 

పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో.. (తేనె మనసులు)
తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. 
విందులే.. చేయనా..

వేణూ గానాలెన్నో ఈ రాధ గుండెల్లో..
మౌన గాథలెన్నో ఈ పేద గుండెల్లో..
పాడనా.. ఊపిరై.. రాధాలోలా..

ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..

అణువణువున హృదయం అడుగడుగున ప్రణయం (కోటికొక్కడు)
చిరునవ్వుల్లో శ్రీరాగం.. అరచూపుల్లో అనురాగం.

తెలుగు సినిమా పాటల్లో అంత్యానుప్రాసాలంకార ప్రయోగం-1

అంత్యానుప్రాసాలంకారము
 
మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్యానుప్రాసాలంకారము అవుతుంది.\

ఉదాహరణలు:

రఘురామ! గుణాభిరామ!

శర్వరీ శీతపవన పక్షముల మలసి, 
స్వాదుమయ నోర్మి సంగీత ఝరుల గలసి, 
కౌముదీ ధౌత శుభ్ర దిక్తటుల సొలసి 

ప్రాతఃకాలమున మేల్కొంచెదను, హరి పాదములను పూజించెదను
  
భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ

తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు 

క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన. 

తోటలో నారాజు తొంగి చూసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. (ఏకవీర, సినారె)
ఏకాంత వేళ.. ఏకాంత సేవ (అన్వేషణ)
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా... 
మల్లెపువ్వుల్లో  తావల్లె కన్నుల్లో  ఎన్నెల్లై
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
ఏకాంత వేళా....

తెలుగు సినిమా పాటల్లో లాటానుప్రాసాలంకార ప్రయోగం

లాటానుప్రాసాలంకారము

అర్థభేధము లేకపోయి తాత్పర్య భేదము కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము. లాట దేశ ప్రజలు ప్రేమించు అనుప్రాసము. 

ఉదాహరణలు: 

కమలాక్షు నర్చించు కరములు కరములు (పోతన భాగవతం; మొదటి కరము సామాన్యము, రెండవది శ్రేష్టము)
  • శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, 
  • సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, 
  • శేషశాయికి మ్రొక్కు శిరము శిరము, 
  • విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, 
  • మధువైరి తవిలిన మనము మనము, 
  • భగవంతు వలగొను పదములు పదములు, 
  • పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని జింతించు దినము దినము, 
  • చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, 
  • కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు, 
  • తండ్రి హరిజేరు మనియెడు తండ్రి తండ్రి 
  • మానవత్వము గలుగు మనిషి మనిషి.
  • తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు.

నీ పని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని (అన్నమయ్య)
నా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆ పని
రేపని మరిమాపని క్షణమాపని మాపని (మాపు, క్షణము ఆపని, మా పని)
ఆ పని ఏదో ఇపుడే తెలుపని.. వలపని
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా....
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా (అర్జున్)
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
మథుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి
జాజిమల్లెల ఘుమఘుమల జావళి
లేతసిగ్గుల సరిగమల జాబిలి
అమ్మా మీనాక్షీ ఇది నీ మీనాక్షి
దీన్లో శ్లేషలు గుప్పిళ్లతో చల్లాడు వేటూరి. మథుర – మధురతర, దగ్గరగా వినిపించే మాటలు కాని అర్థాలు దూరం. ఐనా పక్కపక్కన వినిపించి ఆనందాన్ని కలిగిస్తాయి. కంచిపట్టున – కంచి అనే వూళ్లో ఉన్న అని, కంచిలో నేసిన పట్టుచీర కట్టిన అని రెండర్థాల శ్లేష. ఇక చివరిభాగంలో “చిలక” అనే పదాన్ని రకరకాలుగా చిలికేశాడు. ఒక అర్థం చిలక; పక్షి అని, మరో అర్థం చిలికించటం అని; చిలకరించు, ఇంకో అర్థం ఒక ప్రదేశంలో ఉండేదని, ఒక తీపి పదార్ధము, ప్రసరించు, చల్లు, బాణము, కిళ్ళీ, బీడా, తాళం, మజ్జిగ చిలకడం, చిలకతోటకూర, కొలికిముడి, చివరి అర్థం చిలకటం అని. ఇలా ఒకే పదాన్ని ఇన్ని విధాలుగా ఒకే సినిమా పాటలో ప్రయోగించాడు వేటూరి. 
అలానే సితార చిత్రంలో కూడా....
చిలికిన చిలకవు ఉలకవు పలకవు.. ఓ మైనా ఏమైనా 
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన... ఓ మైనా మైనా

జింగు జింగు చీర కోణంగి కొంగు జార

జింగు జింగు చీర...
చిత్రం: లారీ డ్రైవర్ (1990)
రచన: సిరివెన్నెల
సంగీతం: చక్రవర్తి
గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

జింగు జింగు చీర కోణంగి కొంగు జార 
నువ్వంగి వంగి చూడ కంగారుగుందిరో...
కొంగు దొంగ రార ఈ గంగ పొంగు లార 
బంగారు బెంగ తీర రాపాడమందిరో.
చెంగుమనే చెంగునిలా చేపట్టరో
రంగులలో సంగతులే రాబట్టరో
రంగేళి రంగాలు చూపెట్టరో...

రంగు రంగు జాణ నా నంగనాచి మైనా 
నీ హంగు దోచుకోనా నా రంగనాయకీ
అరే... సంబరంగ రాన సంపెంగ సొంపుకూన 
కంగారు హాయి తేనా చెంగావి ఛాయకి
పడుచు ఎదే పొడుపుకథై కవ్వించెరో
తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో
సింగారి సిగ్గారి చిక్కాలిరోయ్

జింగు జింగు చీర కోణంగి కొంగు జార
నువ్వంగి వంగి చూడ కంగారుగుందిరోయ్...

తళుక్కు బెళుక్కు గుళుక్కు అందాలు

తళుక్కు బెళుక్కు
చిత్రం: కోకిల (1989)
సంగీతం: ఇళయరాజా 
రచన: వేటూరి 
గానం: మనో, చిత్ర 

పల్లవి: 

తళుక్కు బెళుక్కు గుళుక్కు అందాలు 
తరుక్కు తరుక్కు కొరుక్కుతింటుంటే
 
దొరక్క దొరక్క ఒడుక్కు సందేళ
ఎరక్క మరక్క ఇరుక్కు పోతుంటే 

గుమ్మెత్తు నీ సోకు గుచ్చెత్తుకుంటేనే కోపాలా 

వెన్నెత్తు కెళ్ళొద్దు నన్నెత్తుకో ముద్దు గోపాలా

తళుక్కు బెళుక్కు గుళుక్కు అందాలు 
తరుక్కు తరుక్కు కొరుక్కుతింటుంటే
 
దొరక్క దొరక్క ఒడుక్కు సందేళ
ఎరక్క మరక్క ఇరుక్కు పోతుంటే