November 22, 2021

తెలుగు సినిమా పాటల్లో అంత్యానుప్రాసాలంకార ప్రయోగం-3

అంత్యానుప్రాసాలంకారము
 
మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్యానుప్రాసాలంకారము అవుతుంది.\

తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు 

క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన. 

పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు (రాజా రమేష్, ఆత్రేయ)
రంగులన్ని రంగరించి పూత పూసినాడు
పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు
రంగులన్ని రంగరించి పూత పూసినాడు
ఆ ఘుమఘుమలు గుమ్మరించి శ్వాస నింపినాడు
నీ శ్వాస నింపినాడూ...
నీ పెదవులలో పూదేనియ పొదిగి తీర్చినాడూ...
ఎంతో రసికుడు దేవుడు...
వేదాలకైన మూలమది.. (అమరజీవి)
నాదాలలోన భావమది 
దైవాలకైన ఊయలది.. 
కాలాలకన్న వేదమది 
కన్నీళ్ళు మింగి బ్రతికేది.. 
అది లేనినాడు బ్రతుకేది 
నీకై జీవించి.. 
నిన్నే దీవించి.. 
నీకై మరణించు.. 
జన్మజన్మల ఋణమీ ప్రేమ 

ఓదార్పుకన్న చల్లనిది.. 
నిట్టూర్పుకన్న వెచ్చనిది 
గగనాలకన్న మౌనమిది.. 
అర్చనగా..ద ద ద ని 
అర్పణగా.. ని ద ని స.. 
దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ

ఏ చిలిపి కళ్ళలోన కలవో (ఘర్షణ, కులశేఖర్)
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో 
మధుమాసం లోనా మంచు పూలజల్లువో
మధుమాసం లోనా మంచు పూలజల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
ఉప్పొంగెలే గోదావరి (గోదావరి)
ఊగిందిలే చేలో వరి 
భూదారిలో నీలాంబరి 
మా సీమకే చీనాంబరి 
వెతలు తీర్చు మా దేవేరి 
వేదమంటి మా గోదారి 
శబరి కలిసిన గోదారి 
రామచరితకే పూదారి
ఊర్వశివో... (వసంత గీతం)
ఉదయినివో... 
మువ్వల నవ్వుల మోహినివో
ఊర్వశివో... 
ఉదయినివో... 
మువ్వల నవ్వుల మోహినివో
రాగిణివో..
రసధ్వనివో... 
బృందావనికే ఆమనివో
రాగిణివో..
రసధ్వనివో... 
బృందావనికే ఆమనివో
గుండెలలో నీకు గుడికట్టినానే (టాక్సీ డ్రైవర్)
అనురాగదీపాలు వెలిగించినానే
శిలవని తెలియక పూజించినానే
విషమని తెలియక సేవించినానే
అది సరిగమ పాడిన స్వరవీణ..(రక్త సింధూరం)
ఇది సరసాలాడిన చలి వీణ

ఇది చూపులు కలిసిన సుఖవీణ..
ఇది ముసిముసి నవ్వుల ముఖవీణ
ఝుమ్మని పలికిన ఎదవీణ..
నను రమ్మని పిలిచిన రసవీణ
ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా (జీవితంలో వసంతం)
ఈ కొండగాలులలో హా... గుసగుసలే నీ ఊసులుగా 
ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా 
ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా 
తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో 
మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో 
ఇదే ఇదేలే జీవితం 
లలాలలా 
జీవితంలో వసంతం 
ఆ ఆ ఆ ఆ 
ఇదే ఇదేలే జీవితం 
అహహహహ 
జీవితంలో వసంతం 
నీలాల మబ్బులలో...
నీలాల మబ్బులలో 
తేలి తేలి పోదామా...
తేలి తేలి పోదామా 
సోలి సోలిపోదామా
నయనాలు కలిసె తొలిసారి.... (ఛైర్మన్ చలమయ్య, ఆరుద్ర)
హృదయాలు కరిగె మలిసారి... 
తలపే తరంగాలూరి... పులకించె మేను ప్రతిసారి.... 
నేల పల్లవి పాడంగా.. నీలి మబ్బు ఆడంగా (స్వాతికిరణం, వెన్నెలకంటి)
రివ్వున గువ్వే సాగంగా.. నవ్వే మువ్వై మ్రోగంగా
నీలి మబ్బు ఆడంగా.. నవ్వే మువ్వై మ్రోగంగా

ఉంగా ఉంగా రాగంగా.. ఉల్లాసాలే ఊరంగా
ఉంగా ఉంగా రాగంగా.. ఉల్లాసాలే ఊరంగా
ఊపిరి ఊయల లూగంగా.. రేపటి ఆశలు తీరంగా

తెనుగుదనం నోరూరంగా.. తేటగీతి గారాబంగా
తెనుగుదనం నోరూరంగా.. తేటగీతి గారాబంగా
తెమ్మెరపై ఊరేగంగా .. వయ్యారంగా..
 
కొండాకోనల్లో లోయ్యల్లో... గోదారి గంగమ్మా సాయల్లో...
ఆ... గోదారి గంగమ్మా సాయల్లో...
నిన్ను కన్నా..మనసు విన్నా (స్వాతి చినుకులు)
ఎదలో..మోహనాలాపన..ఆ
నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ
నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా
ఆ గుండెలు తీసిన బంటు (గూండా)
నా గుండెను గుట్టుగ అంటు 
గాజుల గలగల వింటు
కౌగిలి విందులు తింటూ 
అరిచే కోడిని తిట్టూ 
ఆరని ముద్దులు పెట్టు 
పెట్టు పెట్టు పెట్టు
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో (కొదమ సింహం)
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో
జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో
పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో
వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో

కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్ళే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్ళే మోసుకొచ్చె తగవుల్లో బిగువుల్లో
సంపంగి ధూపాలేసే గుండెల్లో విందుల్లో
సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో
పండుకుంటా తోడు ఈ పైరగాలుల్లో
అల్లుకుంటా గూడు నీ పైటచాటుల్లో
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా (ఇద్దరు దొంగలు)
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా

నీ కొంటెచూపు మనసంత వెలుగు వేదాలు పాడగా
అల్లారుపొద్దు అల్లారుముద్దు నీకే జవాబులిస్తాగా
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ (గుంటూరు శేషేంద్రశర్మ, ముత్యాల ముగ్గు)
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది
కురిసే దాకా అనుకోలేదూ శ్రావణమేఘమని (పంతులమ్మ)
తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని
కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమని
పెదవినేనుగా..పదము నీవుగా..ఎదను పాడని
తేలు కుట్టినా తెనాలిలో (సూపర్ పోలీస్)
తేనెటీగల పెదాలలో 
మంటపెట్టకూ మనాలిలో 
మల్లెమొగ్గలా మసాజులో 
కన్నుకొట్టకే కబాడిలో
కౌగిలింతలా కవాతులో 
లవ్వు అన్న ఈ లడాయిలో
పువ్వు తాకకు బడాయితో 
పొగరు, సొగసు గల చిన్నది...(నీడలేని ఆడది, సినారె)
బిగి కౌగిలిలో ఒదిగున్నది...
పొగరు...సొగసు గల చిన్నది...
బిగి కౌగిలిలో ఒదిగున్నది..
ఈ విసురూ ఎక్కడిది...?
నీ జతలోనే నేర్చినది....

తొలివలపే... తియ్యనిది...
మదిలో... ఎన్నడు మాయనిది
నీ కొరకే దాచినదీ...వేరెవరూ దోచనిది
తొలివలపే... తియ్యనిది
మదిలో...ఎన్నడు మాయనిది
ఏవిటో ఏమో ఈ ప్రేమా (రంగేళి, సిరివెన్నెల)
శాపమో, వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమా
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో, అమృతమో చెప్పేవారే లేరమ్మా

ఏ నిమిషం ఇది మొదలవుతుందో తెలియదు
గుండెల్లో చేరేముందు అనుమతి అడుగదు
మనసుంటే ప్రే...మించక మానదు
ప్రేమిస్తే మనదంటూ...మనసే మిగలదు
అక్షరాలు రెండే అయినా
లక్షలాది కథలను వ్రాసే
ఈ ప్రేమలో పడి నిలబడతరమా...
లేనిపోని సైగలు చేసి నను లాగాలా (ఇష్టం)
చేరగానే వెనకడుగేసి వెటకారాలా
లోలో సరదా లేదా పైపై పరదాలేలా
తగువేలా నాతో తగువేళా 
బిగువేలా ఇంకా బిడియాలా

ఎవరైనా చూశారా…..
ఎవరైనా చూశారా పరువే చెడదా పురుషోత్తమా
అరెరే అనరా ప్రియనేస్తమా ఎవరైనా చూశారా
గారంగా కొసరే వేళా కారంగా కసిరేవేలా?
గుండెల్లో జరిగే గోల మౌనంగా ఉంటే మేలా
శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి ... సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది(అల్లరి ప్రియుడు)
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి...అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది

ఇనుకోని ఆరాటం ఇబ్బంది ... 
ఇడమరిసే ఈలెట్టా వుంటుంది
ఎదలోన ఓ మంట పుడుతుంది...  
పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది

చిరుముద్దుకి ఉండాలి చీకటి అంది..
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది...
ఏం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది

బాగున్నది కోడె ఈడన్నది
ఈడందుకే వీధి పాలైనది
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది 
చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా (అల్లరి ప్రియుడు)
కన్నె  పువ్వా... కన్నె  పువ్వా
వెన్నెలవాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా ... చిందే రవ్వా పొద్దే నువ్వా
గుండెచాటు ప్రేమలెన్నొ పోటుమీద చాటుతున్న రోజాపువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా... ఆ..ఆ.. ఆ..ఆ

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా... నవ్వేనువ్వా
అందమా నీ పేరేమిటి అందమా (అల్లరి ప్రియుడు)
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా... బాపు గీసిన చిత్రమా
తెలుపుమా..  తెలుపుమా...  తెలుపుమా

పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మధురా నగరమా... కృష్ణ సాగర కెరటమా
తెలుపుమా...  తెలుపుమా...  తెలుపుమా
కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం(దొంగ-దొంగ, రాజశ్రీ)
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం
తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట (శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, దేవులపల్లి)
తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట

మెరుపు తీగ తోరణాలు మెరిసి మురిసిపోయేనంట
మరపురాని వేడుకులంట.. 

పిల్లగాలి మేళగాళ్లు పెళ్లి పాట పాడేరంట
పిల్లగాలి మేళగాళ్లు పెళ్లి పాట పాడేరంట

రాజహంస జంట చేరి.. రత్నహారతిచ్చేనంట
రాసకేళి జరిపేరంట 

వన్నెచిన్నెల ఇంద్రధనుసుపై... వెన్నెల పానుపు వేసేనంట
వన్నెచిన్నెల ఇంద్రధనుసుపై... వెన్నెల పానుపు వేసేనంట

మబ్బులు తలుపులు మూసేనంట... ఆ...ఆ... ఆ...
మబ్బులు తలుపులు మూసేనంట
మగువలు తొంగి చూసేరంట...
మనలను గేలి చేసేరంట... 

ఆకాశపందిరిలో...  నీకు నాకు పెళ్లంట
అప్సరలే పేరంటాళ్లు...  దేవతలే పురోహితులంట
కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే (గుండమ్మ కథ, పింగళి)
కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృత వాహిని ఓలలాడి మైమరచితిలే

ముసిముసినవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
ముసిముసినవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ వలపు పాశమని బెదరితిలే

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
నల్లా నల్లాని మబ్బు నడిచింది (బుద్ధిమంతుడు, ఆరుద్ర)
తెల్లా తెల్లాని అంచు తోచింది
నల్లా నల్లాని మబ్బు నడిచింది 
తెల్లా తెల్లాని అంచు తోచింది
తనువు సెలరేఖలై వెలిగింది
తనువు సెలరేఖలై వెలిగింది
చల్లా చల్లాని జల్లు కురిసింది

సన్నగాజుల రవళి పిలిచింది 
సన్నజాజుల దండ వేసింది
సన్నగాజుల రవళి పిలిచింది 
సన్నజాజుల దండ వేసింది
మనసైన జవరాలే వలచింది...
మనసైన జవరాలే వలచింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది
కళ్ళతో... నవ్వకు...కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది (చుట్టాలున్నారు జాగ్రత్త, సినారె)
గుండెలో చూడకు...గుబులుగా ఉన్నది... 
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది 

తొలిచూపున దాచించి 
మలిచూపున తెలిసింది... 
తొలిచూపున దాచించి 
మలిచూపున తెలిసింది... 
ఆ చూపుల అల్లికలోనే పెళ్ళిపిలుపు దాగున్నది... 

ఆ..వయసు దారి తీసింది... 
వలపు ఉరకలేసింది 

మనసు వెంబడించింది...నిమిషమాగకా... 
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా... 

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా.. 
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా 
చిగురుటాకులే చేతులుగా..(అక్బర్-సలీం-అనార్కలి, సినారె)
మిసిమిరేకులే పెదవులుగా
చిగురుటాకులే చేతులుగా..
మిసిమిరేకులే పెదవులుగా
పరిమళాలే పిలుపులుగా..
మకరందాలే వలపులుగా
పూవులెంతగా వేచేనో..
పూవులెంతగా వేచేనో
తుమ్మెదల కోసం..
తుమ్మెదల కోసం
తారలెంతగా మెరిసేనో

నింగి రంగులే కన్నుల దాచి 
కడలి పొంగులే ఎదలో దాచి
నింగి రంగులే కన్నుల దాచి 
కడలి పొంగులే ఎదలో దాచి
గులాబి కళలే బుగ్గల దాచి 
మెరుపుల అలలే మేనిలో దాచి
పరువాలెంతగ వేచేనో..
పరువాలెంతగ వేచేనో
పయ్యెదల కోసం..పయ్యెదల కోసం
తారలెంతగా మెరిసేనో..
చందురుని కోసం    
చందమామ రాతిరేళ కదిలెనే (అంజలి, రాజశ్రీ)
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
తానొంటిగా కావాలనీ ఆకాశమే విడిచి వచ్చెనే
భూమి చూసి పరవశించెనే
మరల... మరల... మరల

చిన్నముల్లు పెద్దముల్లు ఒకేచోట చేరుకోగ... పన్నెండు గంటలాయెనే 
పాత యేడు పోయెనంటు కొత్త యేడు వచ్చెనంటు... ఊరిలోన సందడాయెనే
రాగమంతటా వెల్లివిరిసెనే 
శోకమంత తరలిపోయెనే
ఈ భూమియే ఈ వేళలో స్వర్గమల్లె మారిపోయెనే
నెలవంక జతకోసం ఒకమేఘం దరిచేరి అల్లాడెనే పోరాడెనే

చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే 
ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా...(అంతం, సిరివెన్నెల)  
అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వెయ్యి మందున్నా..  
ఒక్కదాన్నే వేగిపోతున్నా...
ఎన్నాళ్ళు ఈ యాతనా... 
ఇట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా... 
ఇట్టాగె ఎదురీదనా...
మేలుకోడేమి నా రాజు చప్పునా ...
మురగపెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్ (అందాల రాముడు, ఆరుద్ర)
పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్
మురగపెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్
పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్

పూచికపుల్లైన వెంట రాదన్నాడోయ్
పూచికపుల్లైన వెంట రాదన్నాడోయ్
పుణ్యమొక్కటే చివరకు మిగులునన్నాడోయ్... డొయ్ డోయ్

రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్
హాయిగా..  తీయగా..  ఆలపించు పాటలా (అనార్కలి, సముద్రాల సీనియర్)
హాయిగా..  తీయగా..  ఆలపించు పాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా

అనారు పూలతోటలా...  అనారు పూలతోటలా
ఆశ దెలుపు ఆటలా

జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమకథా మధురము
జీవితమే సఫలము
నీ కంటి కాటుక చీకటిలో..  (విచిత్ర బంధం, దాశరథి)
పగలు రేయిగ మారెనులే
నీ కంటి కాటుక చీకటిలో.. 
పగలు రేయిగ మారెనులే 

నీ కొంటెనవ్వుల కాంతులలో.. 
రేయి పగలై పోయెనులే
నీ కొంటెనవ్వుల కాంతులలో.. 
రేయి పగలై పోయెనులే

నీ అందము నా కోసమే.. నీ మాట.. 
ముద్దుల మూట.. 
నీ మాట.. ముద్దుల మూట 
వయసే ఒక పూలతోట.. 
వలపే ఒక పూలబాట
ఆ తోటలో ఆ బాటలో.. పాడాలి తియ్యని పాట..
పాడాలి తియ్యని పాట
అంజలీ అంజలీ పుష్పాంజలీ (డ్యూయెట్, వెన్నెలకంటి)
అంజలీ అంజలీ పుష్పాంజలీ

పువ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...(ముత్యాల పల్లకి, మల్లెమాల)
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..

గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ..
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
మారుమూల పల్లెలోన ..మధురగాన ముదయించేనని (ఆరాధన, సినారె)
మారుమూల పల్లెలోన ..మధురగాన ముదయించేనని
శిలలకైన ఆ గానం... పులకింతలు కలిగించేనని
శిలలకైన ఆ గానం ...పులకింతలు కలిగించేనని
అది జతగా నను చేరాలని ..
నా బ్రతుకే శృతి చేయాలని

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందని
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది ...
తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందని
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...
పాడాలంటే హృదయం ఉండాలి (చిల్లర దేవుళ్ళు , ఆత్రేయ)
పాడాలంటే హృదయం ఉండాలి
హృదయానికి ఏదో ఒక కదలిక రావాలి

భావం పొంగాలి.. 
రాగం పలకాలి.. 
దానికి జీవం పోయాలి
భావం పొంగాలి.. రాగం పలకాలి.. దానికి జీవం పోయాలి..

పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. 
మనసిచ్చే మనిషుంటే...
పాడాలనే ఉన్నది..
నీ... వలపుల లోగిలిలో విహరించనీ...(కెప్టెన్ కృష్ణ)
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ...
నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ..

నీ నయనాలలో నను నివసించనీ...
నీ నయనాలలో నను నివసించనీ...
మన ప్రేమనౌక ఇలా సాగనీ..

జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ...ఈ..ఈ..
జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ..

ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ...

కలకాలం ఇదే పాడనీ..
నీలో నన్నే చూడనీ...